'ఆదిపురుష్‌' అగ్ని ప్రమాదంపై అనుమానాలు, కావాలని చేసి ఉంటారేమో!

ప్రభాస్ బాలీవుడ్‌ ఎంట్రీ మూవీ ఆదిపురుష్‌ షూటింగ్ కోసం ముంబయిలోని ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్టింగ్ కాలి బూడిద అయిన విషయం తెల్సిందే.షూటింగ్‌ ప్రారంభించిన రోజే ఆ సంఘటన జరగడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

 Once Again Comes In Adhipurush Set Fire Issue-TeluguStop.com

ప్రస్తుతం కొత్త సెట్టింగ్‌ నిర్మానం జరుగుతోంది.ఈ సమయంలోనే ఆసక్తికర చర్చ ఒకటి ముంబయి సినీ వర్గాల్లో జరుగుతోంది.

ఆది పురుష్‌ సెట్టింగ్ తగలబడటం వెనుక సైఫ్ అలీ ఖాన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.ఆమద్య సైఫ్ అలీ ఖాన్‌ మాట్లాడుతూ రావణుడి గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేశాడు.

 Once Again Comes In Adhipurush Set Fire Issue-ఆదిపురుష్‌’ అగ్ని ప్రమాదంపై అనుమానాలు, కావాలని చేసి ఉంటారేమో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆది పురుష్‌ లో రావణుడిగా కనిపించబోతున్న సైఫ్‌ అలీ ఖాన్ వ్యాఖ్యలు ఆ సమయంలో వివాదాస్పదం అవ్వడం ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పి వివరణ ఇవ్వడం వంటివి జరిగాయి.ఇలాంటి సమయంలో అగ్ని ప్రమాదం జరగడం అనేది ఆ వ్యాఖ్యల వల్లే అంటూ ఉంటే అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ విజువల్‌ వండర్‌ మూవీ షూటింగ్‌ ను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా నుండి సైఫ్‌ అలీ ఖాన్‌ ను తప్పించాలంటూ డిమాండ్‌ వినిపిస్తుంది.ఈ విషయమై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అగ్ని ప్రమాదం విషయమై పోలీసులు ఎంక్వౌరీ అయితే చేస్తున్నారు.ఇప్పటికే ఆ దిశగా కొందరిని ప్రశ్నించినట్లుగా ముంబయి వర్గాల ద్వారా తెలుస్తోంది.మరి కొన్ని రోజుల్లో ఈ కేసు విషయమై పూర్తి వివరాలు వస్తాయని అంటున్నారు.

ఆది పురుష్‌ కోసం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ను హిందీలో రూపొందించి అన్ని భాషల్లో డబ్‌ చేయబోతున్నారు.

#Om Raut #Prabhas #Adipurush #SaifAli #OnceAgain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు