భారీ బడ్జెట్ తో బాహుబలి మరొకసారి తెరకెక్కబోతుందా ?

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా బాహుబలి.ఈ సినిమా తో మన తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళి కే సొంతం.

 Once Again Baahubali Coming With Ott Platform-TeluguStop.com

రాజమౌళి, ప్రభాస్ 5 సంవత్సరాలు ఎంతో శ్రమించి అద్భుతంగా తెరెకెక్కించారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మోత మోగించింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

బాహుబలి హిట్ తర్వాత ఒక్కసారిగా అందరి చూపు తెలుగు సినీ పరిశ్రమపై పడింది.

ఈ సినిమా హిట్ తో ఇప్పటికే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.ఈ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఈ సినిమా క్రేజ్ బాగానే ఉంది.

అయితే దర్శక ధీరుడు రాజమౌళి, ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా 3 వ పార్ట్ ను తెరకెక్కించాలని అనుకున్నారు.

Telugu Bahubali, Netflix, Rajamouli-Movie

ఇందుకోసం రాజమౌళి ప్రముఖ రైటర్స్ తో 3 వ పార్ట్ కోసం కథ రెడీ చేయించారు.బాహుబలి ముందు జరిగిన కథ ఏమిటి అనేది ఈ పార్ట్ 3 లో చూపించబోతున్నారు.అందుకే దీని పేరును బాహుబలి బిఫోర్ బిగినింగ్ పేరుతొ నెట్ ఫ్లిక్స్ దీనిని ఒక సిరీస్ రూపంలో 9 ఎపిసోడ్స్ వచ్చేలా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఈ సిరీస్ ను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే బాహుబలి బిఫోర్ బిగినింగ్ సిరీస్ ను రాజమౌళి తెరకెక్కించకుండా ఈ ప్రాజెక్ట్ ను ప్రవీణ్ సత్తారు, దేవకట్టాలకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

అయితే ఈ దర్శకులు ఆనంద్ నీలకంఠ రాసిన కథ ఆధారంగా భారీగా చిత్రీకరన చేసారు.కానీ షూటింగ్ అంత అయిపోయాక నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం చూసి దీన్ని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేయండి మీ వల్ల 100 కోట్లు నాశనమయ్యాయి అంటూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం.

దీంతో మళ్ళీ నెట్ ఫ్లిక్స్ వారు కొత్త దర్శకులతో, టీమ్ తో అదే సిరీస్ ను200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తుందని సమాచారం.దీనిని బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే అవకాశం కనబడుతుంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube