మ‌రోసారి ఆవు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హైకోర్టు జ‌డ్జి..

దేశంలో ప్ర‌ముఖ స్థాయిల్లో ఉన్న వారు ఏది మాట్లాడినా స‌రే చాలా జాగ్ర‌త్త‌గా ఆచితూచి మాట్లాడాలి.మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రిటీలు, లేదంటే రాజకీయ నాయ‌కులు అలాగే కోర్టు జ‌డ్జిల్లాంటి వారు ఏ మాత్రం పొర‌పాటుగా మాట్లాడినా స‌రే ఇట్టే వైర‌ల్ అయిపోతుంది.

 Once Again Allahabad High Court Judge Made Sensational Remarks About The Cow, Hi-TeluguStop.com

ఎందుకంటే ఇలాంటి వాటికోసం సోష‌ల్ మీడియా కాచుకుని కూర్చుంటుంది.ఇక ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జి మాట్లాడిన మాట‌లు కూడా సోష‌ల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ఆయ‌ని ఇంత‌కు ముందు కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ డిమాండ్ చేసి వార్త‌ల్లో నిలిచారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు.

ఇప్పుడున్న అన్ని జంతువుల్లో కెల్లా ఒక్క ఆవు మాత్రమే ఆక్సిజన్ తీసుకుని తిరిగి మ‌న‌కోసం ఆక్సిజన్ వదులుతుందని చెప్ప‌డం పెద్ద సంచలనమే రేపుతోంది.దీంతో పాటే ఆవు ద్వారా ల‌భించేట‌టువంటి పాలు అలాగే పెరుగుతో పాటు నెయ్యి, ఆవు మూత్రం, పేడ లాంటివి ఇప్ప‌టికే ఎన్నో జ‌బ్బుల‌కు మందుగా ప‌నిచేస్తున్నాయ‌ని, మందు లేని పలు జబ్బుల‌ను కూడా త‌గ్గిస్తున్నాయంటూ హైకోర్టు జడ్జి వివ‌రించారు.

అయితే ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న ఓ ఆవును చంపిన కేసులో భాగంగా చేశారు.

Telugu Allahabad Judge, Cow, Cow Urine, Diseases, Judge, Javed, Uttarpradesh-Lat

ఆ కేసు ఏంటంటే సాంభల్ జిల్లాలో ఉంటున్న జావెద్ ఇప్ప‌టికే చాలాసార్లు ఆవులను ఓన‌ర్ల ద‌గ్గ‌రి నుంచి దొంగిలించి చంపేస్తున్నారంటూ వ‌చ్చిన కేసులో భాగంగా విచార‌ణ జ‌రుపుతున్న సంద‌ర్భంలో హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.అంతే కాదు ఆవుల విష‌యంలో కేసు కాబ‌ట్టి ఎంతో జాగ్ర‌త్త‌గా విచారించి చివ‌ర‌కు ఆ జావెద్‌కు బెయిల్ నిరాకరించారు ఈ జ‌డ్జి.ఆవు విష‌యంలో ఆయ‌న చేస్తున్న ప‌నులు చాలామంది మెచ్చుకోద‌గ్గ‌ట్టుగానే ఉంటున్నాయని చెబుతున్నారు నెటిజ‌న్లు.

మొత్తానికి ఆయ‌న మ‌రోసారి వార్త‌ల్లో నిలిచార‌న్న‌మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube