ఆచార్య కు వీడని కష్టాలు ఈసారి 15 రోజులు ఆలస్యం

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా ఏ ముహూర్తాన అనుకున్నారో కాని మొదటి నుండి ఏదో ఒక కారణంగా ఆగిపోతూనే ఉంది.సైరా సినిమాకు ముందు నుండే ఈ సినిమా ప్రచారం జరిగింది.

 Once Again Acharya Movie Shooting Stopped Due To Ram Charan Corona , Megastar Ch-TeluguStop.com

సైరా సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వకముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలని భావించారు.కాని అది సాధ్యం కాలేదు.

సైరాను పూర్తి చేసి విడుదల అయిన తర్వాత ఆచార్యను మొదలు పెట్టాలనుకున్నారు.దాంతో ఆచార్య సినిమా ప్రారంభం కోసం దర్శకుడు కొరటాల శివ ఏకంగా ఏడాదిన్నర పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రారంభం అయిన తర్వాత కరోనా అంటూ సినిమాకు అడ్డు పడింది.చిరంజీవి వయసు రీత్యా కాస్త ఆలస్యంగా షూటింగ్ ను మొదలు పెట్టారు.

ఇక సినిమా శరవేగంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో మరో బ్రేక్‌ పడింది.

Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Rrr, Tollywood-Movie

ఈ సినిమా షూటింగ్‌ లో రామ్‌ చరణ్‌ హాజరు అవ్వాల్సి ఉంది.వాటి కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో చరణ్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.దాంతో కనీసం రెండు వారాలు అయినా విశ్రాంతి తీసకోవాల్సి ఉంటుంది.

కనుక ఆచార్య సినిమా షూటింగ్‌ రామ్‌ చరణ్‌ రాకపోవడం వల్ల మరో 15 రోజులు ఆలస్యం అవ్వబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ నెల మూడవ వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ను జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందులో రామ్‌ చరణ్‌ పాల్గొనే అవకాశం ఉంది.

మొత్తానికి రామ్‌ చరణ్‌ వల్ల సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.మార్చి లేదా ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube