దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నటించిన సావిత్రి బయోపిక్ మహానటి సినిమా ద్వారా ఉత్తమ నటిగా జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
కీర్తి సురేష్ పెంచుకుంటున్న పేట్ పేరు నైకీ. నేడు తన పుట్టినరోజు కావడంతో కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన పాత ఫోటోలు అన్నింటిని షేర్ చేస్తూ తన గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తను పుట్టి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి ఇంకా తన దృష్టిలో చిన్న పప్పీ అంటూ ఎమోషనల్ అవుతూ తన నైకీ కీ సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలు చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.ఇకపోతే పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.