అమృతను కాపాడేందుకు ఆ డాక్టర్ చెప్పిన అబద్దం ఏంటో తెలుసా.? ఆమె అలా చెప్పకపోయుంటే.?     2018-09-20   09:18:00  IST  Sainath G

ప్రణయ్ అమృత ల లవ్ స్టోరీ తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత కన్నీళ్లు పెట్టించిందో అందరికి తెలిసిందే. ప్రణయ్ హ‌త్య‌పై పోరాటం ప్రారంభించారు అమృత. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని చెప్పారు. అంతేకాదు ప్రణయ్ ఆశయాన్ని నెరవేరుస్తా అన్నారు. కుల రహిత సమాజం నిర్మించడం ప్రణయ్ ఆశయం. దానికోసం ఇప్పుడు అమృత సోషల్ మీడియా వేదికగా పోరాటం మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉండగా..అమృత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమెకు అబద్దం చెప్పాల్సి వచ్చిందని డాక్టర్ మువ్వా జ్యోతి చెప్పారు. ఆసుపత్రి ఆవరణలోనే ప్రణయ్‌పై కత్తి దాడి జరిగిన తర్వాత ఆ విషయాన్ని చెప్పేందుకు మానసికంగా సిద్దం చేసేందుకు అబద్దం చెప్పానని డాక్టర్ గుర్తు చేసుకొన్నారు.

నాలుగు రోజుల క్రితం జ్యోతి ఆసుపత్రిలో చెకప్ కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రణయ్ పై హత్య జరిగింది. ఈ ఘటనలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అమృతవర్షిణి ఆసుపత్రిలోకి వచ్చింది. ప్రణయ్ విషయం చెప్పింది. వెంటనే ఆమె షాక్‌కు గురైంది. అయితే ప్రణయ్ చనిపోయిన విషయం ఆమెకు తెలియకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు డాక్టర్ జ్యోతి చెప్పారు.

on that day iam not revealed pranay death news to Amrtuha Doctor Jyoti-Doctor Muvva Jyoti,pranay Death News

ఫస్ట్ ‌ఎయిడ్ చేసి ప్రణయ్ ను అంబులెన్స్ లో హైద్రాబాద్‌కు పంపించినట్టు చెప్పానన్నారు. ఐసీయూలో ప్రణయ్ కు చికిత్స జరుగుతున్నట్టు అమృతను నమ్మబలికినట్టు తెలిపారు. ఆ తర్వాత ప్రణయ్ ఆరోగ్యపరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పానని.. 20 శాతం మాత్రమే బతికే ఛాన్స్ ఉందని అమృతకు చెప్పానన్నారు. తెల్లారే వరకు ప్రణయ్ గురించి మంచి వార్తను తాను చెబుతానని అమృత ఎదురుచూసిందని డాక్టర్ జ్యోతి తెలిపారు.

ప్రణయ్ ఆరోగ్యం గురించి అమృత అడిగితే చనిపోయిన విషయం చెప్పకుండా రోజు వరకు దాచిపెట్టానని ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమృతి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అబద్దం చెప్పినట్టు ఆమె తెలిపారు.

అంతేకాదు తన కూతురు వర్షిణికి అబార్షన్‌ చేయాలంటూ డాక్టర్‌ జ్యోతిపై పలుమార్లు మారుతి రావు ఒత్తిడి చేశాడు. అయినా ఆ డాక్టర్‌ మానవత్వమే గొప్పదని మారుతీరావు సూచనను పాటించేది లేదంటూ తేల్చేసింది. హత్య ఘటన తదుపరి సైతం డాక్టర్‌ జ్యోతి వర్షిణి ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం బతికి ఉన్న విలువలను పట్టి చూపుతోంది.