కొడుకుకు లేఖ రాసిన జెనీలియా.. నెటిజన్స్ ను కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్?

టాలీవుడ్ నటి హీరోయిన్ జెనీలియా మనందరికీ సుపరిచితమే.బొమ్మరిల్లు హాసినిగా ప్రేక్షకులకు ఈమె మరింత చేరువ అయ్యింది.

 Jegenelia, Tollywood, Emotional Post, Son Birthday,latest News,viral-TeluguStop.com

జెనీలియా నటించిన బొమ్మరిల్లు, రెడీ, ఢీ లాంటి సినిమాలు ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఆ తరువాత ఈమె బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ, తనకు, తన పిల్లలకు,వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఇక జెనీలియా పెద్దకొడుకు రియాన్ ఏడవ పుట్టినరోజు సందర్భంగా జెనీలియా ఎమోషనల్ గా ఒక లేఖను రాసింది.

ప్రియమైన రియాన్‌నీ చిట్టి బుర్రలోని బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నా.అలాగే నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతాను.ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను.చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను.అంతే తప్పించి నిరాశ పడను.ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ,నువ్వు ఒంటరి కాకుండా చూస్తాను.

పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌ ఐ లవ్‌ యూ బ్రేవ్‌ బాయ్‌ అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube