న్యూజిలాండ్ కాల్పుల ఘనలో మూడుకి చేరిన హైదరాబాద్ మృతుల సంఖ్య  

న్యూజిలాండ్ మారణహోమంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి. .

On More Indian Died In New Zealand Shooting-in New Zealand Shooting,on More Indian Died,sensation,telangana

న్యూజిలాండ్ మసీదులోకి ప్రవేశించి ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకి పాల్పడి దానిని యుట్యూబ్, పేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చిన ఘటన అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటికే మృతులు 49కి చేరగా తాజాగా హైదరాబాద్ కి చెందిన మరో ముస్లిం వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 50కి చేరింది. .

న్యూజిలాండ్ కాల్పుల ఘనలో మూడుకి చేరిన హైదరాబాద్ మృతుల సంఖ్య-On More Indian Died In New Zealand Shooting

ఇప్పటికే ఈ ఘటనలో తెలంగాణకి చెందిన ఫర్హాజ్ హసన్, ఇమ్రాన్ ఖాన్ మరణించారు. ఇక తాజాగా ఒజైర్ ఖదీర్ అనే వ్యక్తి చికిత్స పోదుతూ చనిపోయాడు.

ఇదిలా ఉంటే ఈ మారంహోమానికి పాల్పడిన వ్యక్తి కేవలం ట్రెండ్ క్రియేట్ చేయడం కోసమే అలా కాల్పులకి పాల్పడినట్లు కోర్ట్ విచారణలో పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే నిందితుడు కాల్పులకి పాల్పడబోతున్నట్లు తమకి 9 నిమషాల ముందే సమాచారం అందిన ప్రజలని కాపాదలేకపోయాం అని న్యూజిలాండ్ ప్రధాని చెప్పుకొచ్చారు.