భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఓటు బ్యాంక్ కోసం మైనారిటీ మెజారిటీ అనే చీలికను తెచ్చింది.ఇదే విధానాన్ని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ దేశంలో అమలు చేస్తుంది.
తప్పు చేసినవారిని శిక్షించకుండా మత ప్రాతిపదికనా వాళ్ళను కాపాడుకుంటూ వచ్చింది.దాని ఫలితంగానే దేశంలో మత ఘర్షణలు,బాంబ్ పేలుడులు వంటివి ఎక్కువగా జరిగాయి.
కాంగ్రెస్ అవలంబిస్తున్న ధోరణి ముదురుతుండడంతో దేశంలోని ప్రజలంతా ఒక తాటి మీదకు వచ్చి వారికి రెండు పర్యాయాలు దారుణ ఓటమిని అంటగట్టారు.అయినప్పటికీ కాంగ్రెస్ తన ధోరణి మార్చుకోవడం లేదు.
తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు ప్రబుద్ధులు చేసిన పని వల్ల మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.కేరళ రాష్ట్రం నుండి వచ్చిన కొందరు మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపైన మరియు మూడు పోలీస్ స్టేషన్ లపైన దాడి చేశారు.
దాడి చేసింది తమ పార్టీ ఎమ్మెల్యే పైన అని తెలిసినా ఇప్పటివరకు కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ దీనిపై స్పందించలేదు.మైనారిటీలపై చిన్న గీత పడిన అది దుర్మార్గమని అగ్రనేతల నుండి కార్యకర్తల వరకు విరుచుకు పడే కాంగ్రెస్ పార్టీ వారు అదే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన కొందరు మూర్ఖులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా ప్రజాప్రతినిధుల ఇళ్ల పై దాడి చేసిన స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.