ఆ ఎద్దుకోసం ఊరు ఊరంతా కదిలి వచ్చింది..ఎందుకంటే?

మన దేశంలో కొన్ని జంతువులను దేవుడితో సమానంగా చూసుకుంటాం.మామూలుగానే జంతువులను హింసించడం మన దేశంలో నేరం.

 Omni Vani Palem Village Performed Traditional Funerals To Bull Details, Visakhap-TeluguStop.com

ఇంకా మన దేశంలోనే కొన్ని జంతువులకు పూజలు కూడా చేస్తూ ఉంటాం.ఇక ఆవు అయితే అన్నిటికంటే పవిత్రంగా భావిస్తాము.

మన దేశంలో ఆవును పూజిస్తే 3 కోట్ల దేవతలను పూజించడంతో సమానం అని చెబుతూ ఉంటారు.

ఆవు ను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటాం.

ఇక ఎద్దును కూడా నందీశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు.ఇప్పుడు మనం చెప్పుకో బోయే ఊరిలో కూడా ఎద్దును పూజిస్తారు.

అప్పుడప్పుడు మాత్రమే కాదు ఆ గ్రామా ప్రజలు నిత్యం ఎద్దును పూజిస్తూ ఉంటారు.అయితే ఇటీవల జరిగిన ఘటనకు ఆ ఉరి జనమంతా శోక సంద్రంలో మునిగి పోయారు.

ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది? అక్కడ ఏమి జరిగింది అని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

విశాఖ పట్నానికి చెందిన రిషికొండ ఒమ్మివాని పాలెం అనే గ్రామంలో నివసించే ప్రజలు ఒమ్మి గడ్డెన్న అనే కుటుంబానికి చెందిన దేవుడు తౌడు పెద్దు అనే ఎద్దు ఉంది.

Telugu Bull, Funeral Bull, Ommi Gaddenna, Omni Vani Palem, Omnivani, Visakhapatn

ఆ ఎద్దును ఆ ఊరిలో ఉండే ప్రజలంతా నిత్యం పూజిస్తూ ఉంటారు.ఈ ఎద్దును ఆ ఊరిలోని ప్రజలంతా నందీశ్వరుడి ప్రతిరూపంగా భావించి కొలుస్తూ ఉంటారు.అయితే సోమవారం రోజు ఆ ఊరిలో అనుకోని సంఘటన జరిగింది.

ఈ సంఘటనతో ఆ ఉరి జనమంతా శోక సంద్రంలో మునిగి పోయారు.ఎం జరిగిందంటే.సోమవారం నాడు తౌడు పెద్దు అనే ఎద్దుఒక ఇంటి ముందు నుండి వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయింది.

ఎం జరిగిందో అని చూసే లోపులోనే ఆ ఎద్దు మరణించింది.ఆ ఎద్దు మరణ వార్త విని ఊరు ఊరంతా కదిలి వచ్చింది.

ఆ రోజు ఆ గ్రామంలో పెద్ద ఎత్తున గరిడీ కార్యక్రమం నిర్వహించి, విశేషమైన పూజలు చేసారు.రెండు రోజులు పాటు పూజలు నిర్వహించిన తర్వాత ఆ ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube