ఓంకార్‌ తర్వాత చిత్రం ఫిక్స్‌

‘జీనియస్‌’ చిత్రంతో మెప్పించలేక పోయిన ఓంకార్‌ రెండవ ప్రయత్నంలో ‘రాజుగారి గది’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.స్వీయ దర్శకత్వంలో ఓంకార్‌ నిర్మించిన ‘రాజుగారి గది’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

 Omkar Next Movie With Anil Sunkara-TeluguStop.com

విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు కలిగించిన ఓంకార్‌ విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగాడు.దాంతో సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు మూడు రెట్ల వసూళ్లు సాధించడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

రెండవ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఓంకార్‌కు మూడవ సినిమాకు మంచి ఆఫర్లే వస్తున్నాయి.పలువురు నిర్మాతలు ఓంకార్‌తో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఓంకార్‌ మాత్రం అనీల్‌ సుంకర నిర్మాణంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఓకే చెప్పాడు.‘రాజుగారి గది’ చిత్రాన్ని సాయికొర్రపాటితో కలిసి అనీల్‌ సుంకర సమర్పించాడు.

ఆ కారణం చేతే ఆయన నిర్మాణంలో ఓంకార్‌ ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు.ప్రస్తుతం ‘రాజుగారి గది’ చిత్రం ప్రమోషన్‌లో ఉన్న ఓంకార్‌ ఆ తర్వాత తన మూడవ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేసే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube