ముమైత్ పరువు తీసిన ఓంకార్.. మొహం మాడిపోయేలా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు ముమైత్ ఖాన్.తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ముమైత్ ఆ సమయంలో ఒక వివాదంలో కూడా చిక్కుకున్నారు.

 Omkar Humiliates Mumaith Khan For Her Judgement-TeluguStop.com

ప్రస్తుతం ముమైత్ డ్యాన్స్ ప్లస్ అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఓంకార్ ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తుండగా స్టార్ మా ఛానెల్ లో ఈ షో ప్రసారమవుతోంది.

తాజాగా డ్యాన్స్ ప్లస్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో చిన్నపిల్లలు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని ఇల్లే ఇండియా పాటకు డ్యాన్స్ చేస్తారు.అయితే ఆ పర్ఫామెన్స్ చూసిన ముమైత్ ఖాన్ మీరు ఒక్క మిస్టేక్చేసినా మొత్తం యాక్ట్ పోతుంది అలా మిస్టేక్ చేయడం వల్ల డ్యాన్స్ పర్ఫామెన్స్ పెద్దగా ఆకట్టుకోలేదని ముమైత్ చెబుతారు.

 Omkar Humiliates Mumaith Khan For Her Judgement-ముమైత్ పరువు తీసిన ఓంకార్.. మొహం మాడిపోయేలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మిస్టేక్స్ ఉన్నాయనే కారణంతో ముమైత్ చిన్నపిల్లల పర్ఫామెన్స్ కు మైనస్ పాయింట్ ఇస్తారు.

ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్లు రాఖీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేయగా బాబా భాస్కర్ మాస్టర్ ఇష్టపడి డ్యాన్స్ చేయాలే తప్ప కష్టపడి డ్యాన్స్ చేయకూడదని సూచిస్తారు.బాబా భాస్కర్ ఆ కంటెస్టెంట్లకు మైనస్ పాయింట్ ఇస్తారు.ఆ తరువాత ముమైత్ ఆ ఇద్దరు కంటెస్టెంట్లు బాగా చేశారని యు గయ్స్ ఆర్ మై ఫేవరెట్ అని చెబుతారు.

ఓంకార్ వెంటనే వీళ్లలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ప్లస్ ఇచ్చారని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

అలాంటి తప్పులే చిన్నపిల్లలు చేస్తే వాళ్లకు ప్లస్ పాయింట్ ఇచ్చి ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని ఓంకార్ ప్రశ్నించారు.

ఎందుకు మైనస్ లిస్తున్నారని చిన్నపిల్లలు మాట్లాడలేరని మైనస్ లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.న్యాయమంటే అందరికీ ఒకేలా ఉండాలని ఓంకార్ చెప్పగా ముమైత్ ఖాన్ మొహం మాడిపోయింది.

శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు డ్యాన్స్ ప్లస్ షో ప్రసారం కానుంది.

#Dance Plus Show #Mumaith Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు