ఓంకార్‌ కోవిడ్‌ రిపోర్ట్‌ తారుమారు, నేటి నుండి షూటింగ్‌కు జాయిన్‌  

Omkar Corona Positive Fake - Telugu Anchor Omkar Corona, Corona Report, Fake News, Omkar

ఒక రోజంతా కూడా యాంకర్‌ ఓంకార్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.పెద్ద ఎత్తున ఈ విషయంమై వివాదాస్పదం అయ్యింది.

 Omkar Corona Positive Fake

ఓంకార్‌తో పాటు ఇంకా కొందరు బుల్లి తెర వర్గాల వారికి కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది కనుక ఖచ్చితంగా షూటింగ్స్‌ను నిలిపేయాల్సిందే అంటూ కొందరు అన్నారు.ఇలాగే కొనసాగితే పరిస్థితి సీరియస్‌గా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

తీరా చూస్తే ఓంకార్‌ కరోన నిర్థారణ టెస్టు చేయించుకున్న విషయము నిజమే.కాని అది పాజిటివ్‌ రాలేదని నెగటివ్‌ వచ్చిందంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.చిన్న అనుమానంతో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంటే దానికి చాలా పెద్ద రాద్దాంతం చేసినట్లుగా కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా జనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓంకార్‌ విషయంలో మీడియాలో జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం అతడికి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఇలాంటి పుకార్లను కొందరు పుట్టించారు అంటూ కుటుంబ సభ్యులు అన్నారు.

ఓంకార్‌ కోవిడ్‌ రిపోర్ట్‌ తారుమారు, నేటి నుండి షూటింగ్‌కు జాయిన్‌-Movie-Telugu Tollywood Photo Image

ఓంకార్‌ ఎలాంటి అనారోగ్యంతో లేడని ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రస్తుతం షూటింగ్‌కు కూడా రెడీ అవుతున్నాడు అంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఇస్మార్ట్‌ జోడీ షో మంచి రేటింగ్‌తో దూసుకు పోతుంది.మరో వైపు కొత్త సినిమా స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసే పనిలో ఓంకార్‌ ఉన్నాడట.ఈ సమయంలో ఆయన గురించి వచ్చిన పాజిటివ్‌ వార్తలు నిజం కాదని, ఆయన రిపోర్ట్‌ తారుమారు అయ్యి నెగటివ్‌ అయినా పాజిటివ్‌ అంటూ ప్రచారం జరిగిందని క్లారిటీ వచ్చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Omkar Corona Positive Fake Related Telugu News,Photos/Pics,Images..

footer-test