అమెరికా: ఒమిక్రాన్ వేరియంట్.. ‘‘డెల్టా’’లా కాదు, జనానికి ఊరటనిస్తోన్న ఆంటోనీ ఫౌచీ మాట..!!

Omicron Not More Severe Than Delta Variant Of Covid Said Anthony Fauci

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.రోజుల వ్యవధిలోనే 38కి పైగా దేశాల్లోకి ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది.

 Omicron Not More Severe Than Delta Variant Of Covid Said Anthony Fauci-TeluguStop.com

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా . ఒమిక్రాన్పై ఎలాంటి ప్రభావం చూపించలేదంటూ కొందరు చేసిన హెచ్చరికలు ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.ఇక ఇదే సమయంలో బూస్టర్ డోస్ తెరపైకి వచ్చింది.కొందరు నిపుణులు మాత్రం బూస్టర్ డోస్ ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.కొత్త వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా బూస్టర్ డోసును తీసుకోవాలని సూచిస్తున్నారు.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఇతర వేరియంట్లతోనూ పోరాడే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికా చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు.గ‌త వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ విధ్వంస‌క‌ర‌మైంది కాదని అభిప్రాయపడ్డారు.ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట నిజ‌మేనని.డెల్టా క‌న్నా వేగంగా విస్త‌రిస్తోంద‌ని, కాకపోతే డెల్టా క‌న్నా ఒమిక్రాన్ డేంజర్ కాదని ఫౌసీ అన్నారు.

 Omicron Not More Severe Than Delta Variant Of Covid Said Anthony Fauci-అమెరికా: ఒమిక్రాన్ వేరియంట్.. ‘‘డెల్టా’’లా కాదు, జనానికి ఊరటనిస్తోన్న ఆంటోనీ ఫౌచీ మాట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యాక్సిన్ల సమర్థతపై ఆయన స్పందిస్తూ.కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా ప‌నిచేస్తాయ‌న్న దానిపై ల్యాబ్‌లలో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటి ఫ‌లితాలు త్వరలోనే తెలుస్తాయని ఆయన వెల్లడించారు.

ద‌క్షిణాఫ్రికాలో వైరస్ బారినపడి వారిని ప‌రిశీలిస్తే, అక్కడ బాధితుల సంఖ్య ఎక్కువగానే వున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య డెల్టా క‌ంటే త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ఫౌచీ వెల్లడించారు.అయితే ద‌క్షిణాఫ్రికా ప‌రిణామాల‌ను అంచ‌నా వేసేందుకు కొంత సమ‌యం ప‌డుతుంద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకెల్‌ ర్యాన్ సైతం ఫౌచీ వ్యాఖ్యలతో ఏకీభవించారు.ఒమిక్రాన్ తీవ్ర లక్షణాలు కలిగిస్తుందనే ఆధారాలు లేవన్నారు.వేరియంట్ ప్రారంభ దశలోనే ఉన్నామని.దానిని అర్థం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ర్యాన్ సూచించారు.

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో రీ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు ఆధారాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఈ కొత్త వేరియంట్‌తో రీ ఇన్ఫెక్షన్ ముప్పు ఉందా? లేదా? అనే దాని కంటే అది ఏస్థాయిలో తీవ్రత కలిగిస్తుందనే దాని గురించే ఆలోచిస్తున్నామని మైకెల్ ర్యాన్ పేర్కొన్నారు.

#Anthony Fauchie #Agency #Medical Adviser #Michael Ryan #Kovid Vaccine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube