భారత్ లో ఒమిక్రాన్ !  లాక్ డౌన్ పై చర్చ 

Omicron In India Talk About Lock Down

మొన్నటి వరకు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వైరస్ వణికించింది.ఆ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా డెల్టా వైరస్ విజృంభించింది.

 Omicron In India Talk About Lock Down-TeluguStop.com

కర్ణాటకలో శరవేగంగా డెల్టా వైరస్ విజృంభించడంతో ప్రపంచదేశాలు అల్లాడి పోయాయి ఇక ఆ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న సమయంలో అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్ వైరస్ ప్రభావం పెరిగిపోయింది.  ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఈ వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది.

డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్ల వేగంతో ఈ ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగుతోంది.ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్ విషయంలో అప్రమత్తమయ్యాయి.

 Omicron In India Talk About Lock Down-భారత్ లో ఒమిక్రాన్   లాక్ డౌన్ పై చర్చ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతర్జాతీయ ప్రయాణికులపై అనేక ఆంక్షలు విధించాయి.అలాగే కొన్ని దేశాలకు రాకపోకలు నిషేధించాయి.

పౌరులు , ప్రవాసులు ఎవరు దేశం దాటి వెళ్లొద్దని సూచనలు చాలా దేశాలు చేశాయి.ఈ మహమ్మారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

  కొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ విధించే విషయంపై చర్చ జరుగుతోంది.

ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వైరస్ భారత్ లోనూ అడుగు పెట్టింది.భారత్ లో 4 కేసులు నమోదు అయ్యాయి.

  కర్ణాటకలోని బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు నవంబర్ 11న ఒకరు,  నవంబర్ 20 న  మరొకరు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చారు అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ టాక్ రావడంతో వారిని ఐసోలేషన్ లో పెట్టారు.

Telugu Bharath, Carona, India, Lock, Omikran-Telugu Political News

అలాగే మహారాష్ట్రలో నూ ఓ కేసు నమోదయింది.తెలంగాణకు వచ్చిన ఓ మహిళకు పాజిటివ్ గా తేలడంతో ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.ఇప్పుడు భారత్ లో ఈ వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు అంశం పై చర్చ జరుగుతోంది.

  గతంలో కరోనా వైరస్ సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా భారత్ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.అన్ని వర్గాల ప్రజలు ఈ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పటికే అనేక ఆంక్షలను భారత్ లో విధించారు.అయితే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కునేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమా లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది తేలాల్సి ఉంది.

#Carona #Lock #Omikran #Bharath #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube