ఒమిక్రాన్ దెబ్బ... రకుల్ బాలీవుడ్ ఆశలన్ని గల్లంతు?

సాధారణంగా కొంతమందికి ఇండస్ట్రీలో అవకాశాలు రాక వెనుకడుగు వేస్తుంటారు మరికొందరికి మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలన్న ఎంతో అదృష్టం ఉండాలి.అలాంటి అదృష్టానికి చాలా దూరంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

 Omicron Effect On Rakuls Bollywood Dreams Omicron,  Bollywood , Rakul Preeth Sin-TeluguStop.com

ఈమె దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో  ఏకంగా వరుస సినిమాలలో నటించి ఆ సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేసి ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ అనే 4 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ పూర్తిచేసింది.

అయితే ఈ సినిమాలన్నీ కూడా విడుదల తేదీలను ప్రకటించి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వీటిపై ఒమిక్రాన్ దెబ్బ పడిందని చెప్పవచ్చు.ఇలా ఈ సినిమాలన్నీ వరుసగా విడుదలైతే తన పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోతోందని తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో కలలు కనింది.

Telugu Bollywood, Jee, Dreams, Omicron, God-Movie

అయితే రకుల్ ఆశలన్నీ అడియాసలుగా మిగిలిపోయాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కారణంగా థియేటర్లు మరొకసారి మూతపడటంతో సినిమాలన్నీ మరోసారి విడుదల వాయిదా పడ్డాయి.ఇలా థియేటర్లు మూత పడిన క్రమంలో రకుల్ నటించిన ఈ సినిమాలు తిరిగి థియేటర్లో విడుదల అవుతాయా లేదా ఒటీటీలో విడుదలవుతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube