సీజన్లు లేవ్.. కరోనా కటాక్షమే ముఖ్యం.. కొత్త రూట్ లో టాలీవుడ్?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలందరూ కూడా కొన్ని సీజన్లను ఫాలో అవుతూ ఉంటారు.కొంతమంది సంక్రాంతి మరి కొంతమంది దసరా కొంతమంది సమ్మర్ సీజన్ ఫాలో అవుతూ ఉంటారు.

 Omicron Effect For Tollywood In Sankranthi And Summer Seasons Details, Tollywood-TeluguStop.com

చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ సినిమాలను ఆయా సీజన్లలో విడుదల చేస్తే హిట్ కొట్టడం పక్క అని అనుకుంటారు.ఇక ఆయా సీజన్లలో సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా వసూళ్లు వచ్చి లాభాల పంట పండుతుంది అని నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే మొన్నటి వరకు సీజన్లు ఫాలో అవుతూనే తమ సినిమాలను విడుదల చేసేవారు దర్శక నిర్మాతలు.

కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో  ఎప్పటికప్పుడు లెక్కలు మొత్తం మారిపోతున్నాయి.

విడుదల అవుతోంది అనుకొన్న సినిమా పోస్ట్ పోన్ కావడం.ఎప్పుడో విడుదల అవుతుంది అనుకున్న సినిమా కాస్త ముందుగానే విడుదల కావడం లాంటివి జరుగుతుంది.అయితే ఇంతలా అయోమయం నెలకొనడానికి కరోనా వైరస్ కారణం అని చెప్పాలి.2020 సంవత్సరం లో సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎప్పటి లాగానే ఉంది.కానీ ఆ తర్వాత సీజన్లలో సినిమాలను విడుదల చేయాలనుకున్న వారికి మాత్రం కరోనా వైరస్ రూపంలో షాక్ తగిలింది.దీంతో 2020 సంవత్సరం పై అందరూ ఆశలు వదులుకున్నారు.

మరి ఆ తర్వాత 2021లో అయినా కలిసి వస్తుంది అనుకుంటే అంతలోనే రెండవ దశ దూసుకొచ్చింది.

Telugu Corona, Occupancy, Omicron Effect, Radhe Shyam, Rrr Mvoie, Season, Theate

దీంతో సినిమా విడుదల తేదీ వచ్చినా 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడుస్తూ ఉండటం తో నష్టాలు తప్పవు అని భావించి ఎంతోమంది సినిమాలను వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు 2022 సీజన్లో అయినా సరే పెద్ద సినిమాలకు విముక్తి లభిస్తుంది అనుకున్నారు అందరు.కానీ అంతలోనే ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చింది.

దీంతో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే విడుదల కావాల్సిన త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి.

ఇక రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుందా లేదా అన్నది ఊహకందని విధంగానే ఉంది.

Telugu Corona, Occupancy, Omicron Effect, Radhe Shyam, Rrr Mvoie, Season, Theate

అదే సమయంలో మూడవ దశ నాలుగవ దశ ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి.దీంతో సీజన్ లను ఫాలో అవకుండా కరోనా వైరస్ కరుణించినప్పుడే సినిమాలను విడుదల చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు ఎంతోమందిదర్శక నిర్మాతలు.రానున్న రోజుల్లో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండి సినిమా థియేటర్లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించినప్పుడే సినిమాలను సీజన్ తో సంబంధం లేకుండా విడుదల చేయాలని భావిస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube