ఒమిక్రాన్ ఎఫెక్ట్: తెలుగు ఎన్నారైల ఆవేదన...!!

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది, లెక్కకు మించిన కేసులు రోజు రోజుకు నమోదు అవుతున్న నేపధ్యంలో పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి, ట్రావెల్ విషయంలో ఆంక్షలు పెట్టాయి.అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా నమోదవని విధంగా కేసులు పెరుగుతున్నాయి.

 Omicron Effect Consciousness Of Telugu Nris , Omicron, America, Sankranthi , I-TeluguStop.com

ఒకరకంగా చెప్పాలంటే ఒమిక్రాన్ కేసుల విషయంలో అమెరిక అగ్ర స్థానంలో ఉంటూ రికార్డ్ లు సృష్టిస్తోందనే చెప్పాలి.అయితే ఒమిక్రాన్ విజ్రుంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ధనుర్మాసం అంటే సంక్రాంతి సమయంలో సొంత ఊర్లకు ఓ వారం ముందుగానే వచ్చి ఓ నెల రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుని తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేవారు.తమ పిల్లలకు సొంత ఊరు తిప్పి చూపుతూ బందువులను పరిచయం చేస్తూ సంక్రాంతి సంబరాలలో మునిగితేలేవారు.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితులు ఎక్కడా కనిపించడం లేదు.ఒమిక్రాన్ కారణంగా విధించిన ప్రయాణ ఆంక్షలు ఎన్నారైలకు అడ్డుగా మారాయి.పోనీ.

అన్ని అడ్డంకులూ దాటుకుని సొంత ఊర్లకు వచ్చేద్దామ అంటే ఒమిక్రాన్ ప్రభావం తీవ్ర రూపం దాల్చి ఇంటర్నేషనల్ ప్రయాణాలను నిలిపివేస్తే మళ్ళీ గతంలోలా నెలల తరబడి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని, ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు సైతం పోగొట్టుకున్నారని, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి సంవత్సరం పైనే పట్టిందని ఆందోళనకు లోనవుతున్నారు.

ఈ పరిస్థితుల నేపధ్యంలో మెజారిటీ శాతం ఎన్నారైలు విదేశాలలో ఉన్న తెలుగు సంఘాలు ఏర్పాటు చేసే సంక్రాంతి సంబరాలలో పాల్గొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.ఎప్పటిలా సంక్రాంతికి సొంత ఊర్లకు రాలేకపోతున్నమనే బాధ తమను కలిచివేస్తోందని ఆవేదన చెందుతున్నారు మన తెలుగు ఎన్నారైలు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube