అబుదాబి లాటరీలో భారతీయుడికి భారీ జాక్ పాట్..అక్షరాలా...రూ...

అదృష్టం ఉండాలే కానీ రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు కొందరు.అలాంటి వారు ఎక్కడో కాని పెట్టి పుట్టరు.

 Oman-based Indian Renjith Venugopalan Unnithan Wins Dhs10 Million In Big Ticket Jackpot, Renjith Venugopalan Unnithan, Lottery Ticket, Kerala Man, Indian Origin Venugopalan,20crores, Abudhabi-TeluguStop.com

అయితే కొందరికి అదృష్టం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించినా దక్కదు, కొందరికి ఊహించని విధంగా వెంటనే వరిస్తుంది.తాజాగా అబుదాబిలో కేరళ కు చెందిన భారత ఎన్నారై కు మాత్రం అదృష్టం అరమందం లో పట్టింది.

అలా ఇలా కాదు రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడ్డాయి సదరు ఎన్నారైకి.కేరళా నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే ఉద్యోగ నిమిత్తం ఒమన్ వెళ్ళిన ఎన్నారై వేణుగోపాలన్ అక్కడ ఉద్యోగం చేసుకుంటూనే లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.

 Oman-based Indian Renjith Venugopalan Unnithan Wins Dhs10 Million In Big Ticket Jackpot, Renjith Venugopalan Unnithan, Lottery Ticket, Kerala Man, Indian Origin Venugopalan,20Crores, Abudhabi-అబుదాబి లాటరీలో భారతీయుడికి భారీ జాక్ పాట్..అక్షరాలా#8230;రూ#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సారిగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసినపుడు విఫలమయ్యాడు.ఆ తరువాత మళ్ళీ తన లక్కు పరీక్షించుకోవాలని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే బిగ్ టికెట్ రాఫెల్ లో టిక్కెట్టు కొనుగోలు చేశాడు.ఇటీవల ఈ లాటరీ డ్రా తీయడంతో అతడి పంట పండింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్లు పైనే లాటరీ గెలుచుకున్నాడు.రెండవ ప్రయత్నంలోనే ఊహించని  విధంగా పెద్ద మొత్తంలో లాటరీ తగలడంతో ఉబ్బితబ్బి అయ్యి  పోతున్నాడు.

12 ఏళ్ళుగా ఒమన్ లో ఉంటున్నా పెద్దగా లాటరీ గురించి ఆలోచన చేయలేదని కానీ ఏడాది క్రితం తన స్నేహితులు అందరూ లాటరీ కొనుగోలు చేస్తుంటే తాను కొన్నానని మొదటి ప్రయత్నం లో విఫలమయినా రెండవ సారి స్నేహితులు అందరం కలిసి లాటరీ కొనుగోలు చేశామని ఈ లాటరీకి ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నామని, స్నేహితులు అందరం కలిసి ఈ మొత్తాన్ని పంచుకుంటామని వేణుగోపాలన్ తెలిపాడు

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube