వచ్చే ఏడాది కోవిడ్ ఉన్న లేకున్నా ఒలంపిక్స్ క్రీడలు జరుగుతాయి: ఐఓసి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది.

 Next Year The Olympics Will Take Place Without Covid Ioc  Olympics, Japan, Sport-TeluguStop.com

కరోనా వైరస్ తో సంబంధం లేకుండా ఒలింపిక్స్ జరుగుతాయని ఐఓసీ వైస్ ప్రెసిడెంట్ జాన్ కోట్స్ ఓ ప్రకటనలో తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదా పడ్డాయి.

ఒలింపిక్స్ క్రీడల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వైస్ ప్రెసిడెంట్ జాన్ కోట్స్ సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.టోక్యో ఒలింపిక్స్ కరోనాతో సంబంధం లేకుండా జరుగాయని అన్నారు.

ఈ ఒలింపిక్స్ క్రీడలు వచ్చే ఏడాది 2021 జూలై 23వ తేదీన జరగనున్నట్లు ఆయన ప్రకటించారు.

జాన్ కోట్స్ మాట్లాడుతూ.

‘‘ప్రపంచం ప్రస్తుతం కరోనా విపత్తులో ఉంది.కరోనా మహమ్మారి కారణంగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి.

లాక్ డౌన్ కారణంగా క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు.అయితే ఈ ఏడాది రద్దైన క్రీడలు సవరించిన తేదీ రోజునే వచ్చే ఏడాది నిర్వహించడం జరుగుతుంది.

అప్పటివరకూ కరోనా వైరస్ ఉన్నా లేకున్నా టోక్యో ఒలింపిక్స్ క్రీడలు యథావిధిగా జరుగుతాయి.వచ్చే ఏడాది అంటే 2021 జూలై 23వ తేదీ నుంచి క్రీడలు కొనసాగుతాయి.

దేశంలో సునామి వినాశనం తర్వాత పునర్నిర్మాణ క్రీడలు అనే థీమ్ తో ముందుకెళ్తున్నాం. 2021లో జరుపుకునే క్రీడలు కోవిడ్ ను జయించే క్రీడలుగా మారనుంది.

త్వరలో చీకటిని తరమికొట్టి వెలుగును నింపబోతున్నాం.’’ అని ఆయన పేర్కొన్నాడు.

2011లో జపాన్ దేశంలో సునామి, భూకంపంతో అల్లకల్లోలం ఏర్పడింది.ఈ విపత్తు నుంచి కోలుకుని ఈ అంతర్జాతీయ క్రీడలకు ఆ దేశం సిద్ధంగా ఉందని ఆ థీమ్ అర్థం.

కరోనా వ్యాప్తి వల్ల విదేశీ సందర్శకుల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. టోక్యో ఒలింపిక్స్ వరకు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందా.లేదా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube