ఫేస్‌బుక్‌ ఫేక్‌ వార్తలకు ముసలి వారే కారణమట.. సర్వేలో వెళ్లడయిన ఆసక్తికర విషయాలు  

Older People Shared Fake News On Facebook More Than Others-older S,older People,sharing Fake News

చిన్న విషయాలు కూడా ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా కారణంగా పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. అవి నిజమా అబద్దమా అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా తెగ షేర్‌లు చేస్తున్నారు. ఇలా అనాలోచితంగా షేర్‌లు చేయడం వల్ల ఫేక్‌ వార్తలు ఎక్కువ అవుతున్నాయి..

ఫేస్‌బుక్‌ ఫేక్‌ వార్తలకు ముసలి వారే కారణమట.. సర్వేలో వెళ్లడయిన ఆసక్తికర విషయాలు-Older People Shared Fake News On Facebook More Than Others

నిజాలకంటే అబద్దాలు చాలా స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతున్నాయి. ఈ విషయం పట్ల నెటిజన్స్‌తో పాటు సోషల్‌ మీడియా వర్గాల వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎలా దీనిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో వారు తలలు పట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ షేర్‌ అవుతున్నట్లుగా సర్వేలో వెళ్లడి అయ్యింది. సర్వేలో వస్తున్న విషయాలతో నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఫేక్‌ వార్తలు ఎక్కువగా ముసలి వారు షేర్‌ చేస్తున్నారట. ఉదాహరణకు ఏదైనా వార్తను వారు చూసినట్లయితే దాని గురించి లోతుగా అద్యయనం చేయకుండానే వెంటనే నమ్మేసి షేర్‌ చేస్తున్నారు.

యువకులు మాత్రం ఒక వార్త వస్తే దాన్ని మరి ఎందులో అయినా వచ్చిందా అనే విషయాన్ని కన్ఫర్మ్‌ చేసుకున్న తర్వాత షేర్‌ చేస్తున్నారట..

విద్యా సంబందిత విషయాలు, లైంగిక విషయాలను 65 ఏళ్ల వయసు వారు ఎక్కువగా వెంటనే నమ్మేస్తున్నారు. తాము నమ్మడంతోపాటు వెంటనే ఆ విషయాన్ని షేర్‌ చేస్తున్నారు. అందుకే ఫేక్‌ వార్తలు ఎక్కువగా షేర్‌ అవుతున్నాయని సర్వేలో వెళ్లడి అయ్యింది.

ఫేక్‌ వార్తలు షేర్‌ అవ్వడం వల్ల కొన్ని సార్లు పెద్ద అనర్థాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఏదైనా సంఘటన జరగకున్నా జరిగినట్లుగా షేర్‌ చేయడం వల్ల గొడవలు జరిగిన సందర్బాలు ఉన్నాయి. అందుకే ఏది పడితే అది షేర్‌ చేయకూడదు..

ఇండియాలో ఫేక్‌ వార్తలను షేర్‌ చేసిన వారికి శిక్ష కూడా పడుతుంది. అందుకే సోషల్‌ మీడియాలో ఏదైనా షేర్‌ చేసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని షేర్‌ చేయడాని మాత్రం ఎలాంటి ఆలోచన అక్కర్లేదు.

మీ ఫ్రెండ్స్‌ జాబితాలో ఎవరైనా వృద్దులు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకుంటారు, అందుకే వారి కోసం ఈ విషయాన్ని షేర్‌ చేయండి.