వైరల్: చివరి నిమిషంలో లేచి కూర్చున్న చనిపోయిన వృద్ధురాలు..!

అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి.అలాంటి ఘటనలు చూసి మనం ఆశ్చర్యపోతాం.

 76 Year Old Covid Positive Woman Wakes Up Before Cremetion, Covid Positive,baram-TeluguStop.com

కొన్ని సార్లు భయపడిపోతాం.కొన్నిసార్లు కొన్ని జరిగాయంటే మనం వాటిని నమ్మలేం.

ఇలాంటి ఓ విచిత్ర ఘటన తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది.ఓ 76 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని.

కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు.అంత్యక్రియల సమయానికి ఆమె లేచి కూర్చుంది.

దీంతో అందరూ షాకయ్యారు.ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

బారామతిలోని ముధాలే గ్రామంలో శకుంతల గైక్వాడ్ అనే ఓ 76 ఏళ్ల మహిళ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు.దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

కాసేపట్లో తల కొరివి పెడతారనగా ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది.దీంతో అందరూ షాకయ్యారు.

అయితే ఆ మహిళకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.ఆమె వృద్ధురాలు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు.

ఆ తర్వాత ఆమె మరణించిందని అనుకుని దహన సంస్కారాలకు ఏర్పాటు చేసారు.శకుంతల గైక్వాడ్ ను మే 10 న ప్రైవేట్ వాహనంలో బారామతికి తీసుకొచ్చారు.

ఆమెకు ఆస్పత్రిలో బెడ్ దొరకలేదు.దీంతో ఆమె కారులోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.

కారులోనే పడిపోయి కదలకుండా ఉండిపోయింది.ఆమె తుదిశ్వాస విడిచిందని అంతా భావించారు.

అంత్యక్రియల కోసం బంధువులకు సమాచారం అందించి.ఏర్పాట్లు చేయగా ఆమె లేచి కూర్చుంది.

అకస్మాత్తుగా, ఏడవడం మొదలెట్టిందని, ఆ తర్వాత కళ్ళు తెరిచిందని అధికారులు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.

దీంతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువైంది.కొన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో సరిపడా బెడ్స్ లేక అంబులెన్స్ లలోనే రోగులు చికిత్స తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న ఘటనలు మనం ఇదివరకే చూసాం.

ఇంకా అలాంటివి చూస్తూనే ఉన్నాం.ఆస్పత్రుల్లో బెడ్ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

అదృష్టవశాత్తు శకుంతల గైక్వాడ్ కొన ఊపిరి వరకు వెళ్లి మళ్లీ బ్రతికొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube