కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఇంత దారుణమా.. ?

లోకంలో నాటికి మనుషుల్లో పెరిగిపోతున్న కౄరత్వాన్ని చూస్తుంటే జంతువుల కంటే దారుణంగా కనిపిస్తుంది.హింసను ఇష్టంగా చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారు ఎందరో ఉన్నారు.

 Old Woman Murder-TeluguStop.com

ఇలా మనిషి ప్రాణాలను సులువుగా తీస్తున్నాడు.ఇకపోతే 77 ఏండ్ల వృద్దురాలిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.

 Old Woman Murder-కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఇంత దారుణమా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వొర్లి ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటున్న వృద్ధురాలిని ఆ ఇంట్లో పని చేసే పని వారిలో ఒకడైనా 22 ఏండ్ల అమర్జీత్‌ నిషద్ అనే యువకుడు, ఆ వృద్దురాలి కాళ్లూ చేతులు కట్టిపడేసి, నోట్లో గుడ్దలుకుక్కి ఊపిరాడని స్థితిలో మరణించేలా చేసారట.

కాగా ఆ వృద్ధురాలు విగతజీవిగా పడి ఉన్నదనే జాలి లేకుండా నిందితులు ఇంట్లో నగదుతో సహా విలువైన వస్తువులను చోరీ చేశారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసి, చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకోగా, నగదును మాత్రం ఖర్చు చేసినట్టు చెప్పారని వెల్లడించారు.

ఇకపోతే ఆ ఇంటి నుండి రూ 4 లక్షలకు పైబడిన నగలను చోరీ జరిగినట్లు బాధితురాలి కుమారుడు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

#Mumbai #Legs #Old Woman #Tied #Muder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు