ఇంతకంటే దారుణం ఉండదు... ఒక మహిళ సిగ్గు విడిచి అడిగినా వారు పట్టించుకోలేదు  

Old Woman Jumps From Bus For Urine In Tamil Nadu-

కొన్ని సంఘటనలు ఊహించుకుంటనే గుండెలు పిండేస్తుంది.ఆడవారు చిన్న హెల్ప్‌ అడిగినా కూడా కాదనుకుండా చేస్తూ ఉంటారు.అయ్యో ఆడమనిషి అడిగింది కదా అనుకుని వెంటనే హెల్ప్‌ చేస్తాం.సాధ్యం అయినంత వరకు ఖచ్చితంగా హెల్ప్‌ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు.కాని తమిళనాడులోని ఒక బస్సు డ్రైవర్‌ మరియు కండక్టర్‌ ఒక మహిళ అని కూడా చూడకుండా సిగ్గు పడే విషయాన్ని వారి వద్ద పదే పదే విన్నవించినా కూడా వారు పట్టించుకోలేదు.

Old Woman Jumps From Bus For Urine In Tamil Nadu--Old Woman Jumps From Bus For Urine In Tamil Nadu-

దాంతో ఆ మహిళ బస్సు నుండి కిందకు దూకింది.దాంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

Old Woman Jumps From Bus For Urine In Tamil Nadu--Old Woman Jumps From Bus For Urine In Tamil Nadu-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు విరుద్‌ నగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.ఇడయాన్‌ కుళం ప్రాంతంకు చెందిన పాండియమ్మాళ్‌ అనే మహిళ బస్సులో ఆండిపట్టి నుండి శ్రీవిల్లి పుత్తూరుకు వెళ్తోంది.ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగా మూత్రం వచ్చింది.డ్రైవర్‌ మరియు కండక్టర్‌ను మూత్రం పోసేందుకు ఒక్క నిమిషం బండి ఆపాలంటూ కోరింది.

కాని డ్రైవర్‌ ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ప్రస్తుతం ఎక్కడ బస్సు ఆగదు, ఒక్కరు దిగితే వెంట వెంటనే అంటూ అందరు తిగుతారు.బస్సు ఆపిన చోటే మూత్ర విసర్జన చేయాలంటూ చెప్పడం జరిగింది.ఆమె పదే పదే ప్రాదేయ పడినా కూడా వారు ఒప్పుకోలేదు.

ఆమె బస్సులో నలుగురి ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక, అలా అని మూత్రంను ఆపుకోలేక బస్సు నుండి దూకేసింది.దాంతో షాక్‌ అయిన ఇతర ప్యాసింజర్లు వెంటనే బస్సును ఆపించారు.ఆమెకు కాళుకు ప్యాక్చర్‌ అవ్వడంతో గాయాలు అయ్యాయి.

ఆమెను స్థానిక హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు.ఇక బస్సు డ్రైవర్‌ మరియు కండక్టర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసు విషయంలో ఆర్టీసి కూడా చాలా సీరియస్‌ అయ్యింది.తమిళనాడు ఆర్టీసి అధికారులు బస్సు డ్రైవర్‌ మరియు కండక్టర్‌పై చర్యలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.