వైరల్: బిచ్చగత్తే ఆర్యన్ ఖాన్ కారు వద్దకు వస్తే.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.గతంలో ఈ డ్రగ్ మాఫియా కేసులో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు అరెస్ట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి.

 Old Video Of Aryan Khan Behavior With Beggar Woman Going Viral, Aryan Khan, Vide-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్టయిన సంగతి బీటౌన్ లో తీవ్ర కలకలం రేపుతోంది.ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ కి సంబంధించిన పలు విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై సముద్ర తీరంలోని ఒక క్రూయిజర్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నఫలంగా క్రూయిజర్ పై దాడి చేశారు.

ఈ క్రమంలోనే ఈ దాడులలో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించడంతో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది గురిని అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఆర్యన్ కి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆర్యన్ గురించి సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి.

అతనికి డ్రగ్స్ ఎప్పటినుంచో అలవాటు ఉందని,అయితే ఈ విషయం గురించి షారుక్ పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఎదురయ్యాయని పలువురు భావిస్తున్నారు.ఇకపోతే గతంలో ఆర్యన్ ఒక బిచ్చగత్తె పట్ల వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం అభిమానులు దీనిని వైరల్ చేస్తున్నారు.

షారుక్ తనయుడు ఆర్యన్, మలైకా అరోరా, మరికొంత మంది స్నేహితులు ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ బిచ్చగత్తె కుర్రాడిని తీసుకొని అతని కారు వద్దకు వెళ్ళింది.అలా తనని చూసిన ఆర్యన్ ఎంతో మంచి మనసుతో తన జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎంతోమంది అభిమానులు అతనిది మంచి మనసు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube