అలనాటి సీరియళ్ళలో నటించిన బుల్లితెర తారలు ఇప్పడేం చేస్తున్నారో తెలుసా..?  

Old Telugu Serial Actresses then and Now, gayatri, likhitha, malayali aswini, chakravakem, preethi amin, serial artists - Telugu Ashwini, Likhitha, Preethi Amin, Serials Artists

ఋతురాగాలు, అలౌకిక, అంతరంగాలు, అన్వేషిత, చక్రవాకం వంటి ఎన్నో సీరియళ్లు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి.అప్పట్లో ప్రేక్షకులు తెలుగు సీరియళ్లను ఎంతగా ఆరాధించేవారు అంటే ఆ సీరియల్స్ లోని పాత్రలు చనిపోతే కంటతడి పెట్టుకునేవారు.

TeluguStop.com - Old Telugu Serial Actresses Then And Now

సీరియల్స్ కు సంబంధించిన ఎపిసోడ్స్ అయిపోగానే రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందోనని ఆలోచించి చుట్టుపక్కల వాళ్లతో కూడా చర్చించేవారు కూడా.కానీ కాలం మారుతున్న కొద్దీ సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.

తద్వారా బుల్లితెర ప్రేక్షకులు సీరియళ్లను ఆదరించడమే మానేశారు.కానీ అప్పట్లో ప్రసారమైన సీరియళ్లను, వాటిలో నటించిన నటినటులను బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పుకోవాలి.

TeluguStop.com - అలనాటి సీరియళ్ళలో నటించిన బుల్లితెర తారలు ఇప్పడేం చేస్తున్నారో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్ల పాటు అలరించిన సీరియళ్లుకు ఎండ్ కార్డు పడడంతో వాటిలో నటించిన నటీనటులు ఎవరికీ కనిపించకుండా తెరమరుగయ్యారు.అయితే వాళ్ల లో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1.

గాయత్రి

పవిత్ర బంధం, మెట్టెల సవ్వడి, కల్యాణి వంటి అనేక సీరియళ్ళలో నటించిన గాయత్రీ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.అయితే ఇప్పుడు ఆమె వెండితెరపై గానీ బుల్లితెరపై గానీ నటించడం లేదని.నటనా రంగానికే పూర్తిగా దూరం అయ్యారని తెలుస్తోంది.

2.

మలయాళీ అశ్విని

ఎన్నో సీరియళ్లలో లీడ్ రోల్స్ లో నటించిన మలయాళ అశ్విని సినిమాల్లో కూడా నటించారు.ఆమె ఎన్నో చిత్రాల్లో హీరోయిన్స్ చెల్లెలి పాత్రలలో నటించి మెప్పించారు.అంతరంగాలు సీరియల్ లో పద్మిని పాత్రలో నటించిన ఈమె బుల్లితెర ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు.కళంకిత సీరియల్ లో కూడా ఈమె నటించి మెప్పించారు.అయితే ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్న ఆమె అక్కడి సీరియళ్ళలో నటిస్తున్నారు.

ఆమె తన సింగపూర్ సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ని ఫేసుబుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

Telugu Ashwini, Likhitha, Preethi Amin, Serials Artists-Telugu Stop Exclusive Top Stories

చక్రవాకం సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సీరియల్ లో స్రవంతి పాత్రలో నటించిన ప్రీతి అమీన్ కి ఫ్యాన్స్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు.అయితే 2014 లో ఈ ముద్దుగుమ్మ లియోనెల్ పెరీరా అనే డాక్టర్ ని పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు.

3.

లిఖిత

లిఖిత కామిని యువర్స్ లవింగ్లీ అనే ఓ జెమిని కార్యక్రమంలో యాంకర్ గా చేసి బాగా పేరు తెచ్చుకున్నారు.యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఆమె బుల్లితెర సీరియళ్లలో దాదాపు పది సంవత్సరాల పాటు కొనసాగారు.2008 నుంచి 2013 వరకు ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ లో ఆమె ప్రేక్షకుల్ని బాగా మెప్పించారు.ఆ తర్వాత ఆమె జయప్రకాశ్ అనే వరంగల్ కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు.ఆమెకు ఇప్పుడు ఒక బిడ్డ కూడా పుట్టింది.

Telugu Ashwini, Likhitha, Preethi Amin, Serials Artists-Telugu Stop Exclusive Top Stories

ఇకపోతే బుల్లితెర సీరియల్స్ లో అత్యద్భుతంగా నటించి మెప్పించిన ఎందరో నటీనటులు కాల గర్భంలో కలిసి పోయినట్లే.ఎందుకంటే ప్రస్తుతం సీరియల్స్ దర్శక నిర్మాతలు కొత్త తరం వారికి అవకాశాలు ఇస్తున్నారు కానీ పాత తరం వారిని కన్నెత్తి కూడా చూడడం లేదు.

#Ashwini #Likhitha #Preethi Amin #Serials Artists

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు