కనుమరగవ్వనున్న పాత రూ.100 నోట్లు..!

ఇకపై వంద రూపాయల నోట్లు చెల్లవని మరో వార్త వినిపించింది ఆర్బీఐ.2016లో మోదీ ప్రభుత్వం రూ.500,రూ.1000 లను నిషేధించిన సంగతి తెలిసిందే.వాటి బదులు కొత్తగా రూ.2000, రూ.200 లను విడుదల చేయగా మొదట్లో వీటి సమస్య చాలా ఎదురయ్యింది.చిల్లర గురించి ఈ పెద్ద నోటు ఎక్కువ చోట్ల మార్పిడిలో కాస్త ఇబ్బందిగా మారింది.

 Old Rs 100 Notes, To Disappear, Rbi-new 10 Rs Coins-reserv Bank-asst Janeral Man-TeluguStop.com

Telugu Rs Coins, Rs Notes, Disappear-National News

అంతేకాకుండా ఆర్బీఐ పదిహేనేళ్ళ కిందట పది రూపాయల కాయిన్ విడుదల చేయగా.వాటివల్ల కూడా పెద్ద సమస్య ఏర్పడింది.చాలామంది కాయిన్ ఉపయోగించడంలో వెనుకాడరు.ఆ మధ్య పది రూపాయల కాయిన్ చెల్లవని పుకార్లు రాగా.తిరిగి మళ్ళీ తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది.దీంతో ప్రజలు కాయిన్ గురించి మొత్తానికి ఆసక్తి చూపలేదు.

దీంతో ఆ కాయిన్ లు బ్యాంకు లోనే ఎక్కువ మోతాదులో నిండిపోగా బ్యాంకుకు కాయిన్ల వల్ల పెద్ద సమస్య ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.

మీనా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.పాత 100 రూపాయల నోట్ల వాడుకను త్వరలోనే నిషేధిస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా 5 రూపాయల నోటు ఇదివరకే వినియోగంలో లేకపోయేసరికి అవి కూడా నిషేధించాలని తెలిపారు.పది రూపాయల నోట్లను కూడా నిషేధించి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రమోట్ చేయడానికి అంగీకరించారు.

దీంతో పాత నోట్లు, కొత్త నోట్లు సర్క్యులేషన్ లో ఉన్నప్పటికీ రెండిటి మధ్య విభేదాలు ఏర్పడటంతో ఒకే నోటును వినియోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.కాగా త్వరలోనే ఈ పాత నోట్ల నిషేధమును మార్చి లేదా ఏప్రిల్ నెలనుంచి జరుగుతుందని తెలిపారు.

కాగా ఈ విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube