కాంగ్రెస్ నేత‌ల ఓల్డ్ రాజ‌కీయాలు.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత దళిత నేతనే ముఖ్యమంత్రిని చేస్తానని ప్రస్తుత సీఎం కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు.కానీ ఎందుకో ఆ హామీ అమలుకు నోచుకోలేదు.

 Old Politics Of Congress Leaders But It Is Difficult , Congress, Dalit Cm, Mariy-TeluguStop.com

రాష్ర్టం ఏర్పడి దాదాపు ఆరేళ్లు దాటుతోంది.దళిత సీఎం హామీ ఈ ఆరేళ్లో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కానీ నేతకు కానీ గుర్తకు రాలేదు.

కానీ ఇప్పుడు సడెన్ గా కాంగ్రెస్ నేతలు దళిత సీఎం హామీ గురించి దీక్షలు ప్రారంభించారు.టీఆర్ఎస్ ను ప్రశ్నలతో ముంచెత్తారు.

 Old Politics Of Congress Leaders But It Is Difficult , Congress, Dalit Cm, Mariy-TeluguStop.com

రాష్ర్టంలో దాదాపు 60 లక్షల మంది దళితులు ఉన్నారని.వారిలో ఏ ఒక్కరిలో కూడా నాయకత్వ లక్షణాలు లేవా అని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రశ్నించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మరియమ్మ అనే దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసి పోలీసులే చంపారని ఆరోపించారు.ఉద్యమ సమయంలో ఎంతో మంది దళిత బిడ్డలే ప్రాణాలు వదిలారని అన్నారు.

దళిత సీఎం హామీ ఏమైందని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం ఏర్పడిన ఇన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ కు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.

Telugu Cm Kcr, Congress, Dalit Cm, Mariyamma Lock, Sc St Attrocity, Telangana, U

ఇప్పుడు దళితులకు మంత్రి పదవులు ఇవ్వాలని మాట్లాడుతున్నారని.తెలంగాణ స్వ రాష్ర్టం సిద్ధించిన రెండేళ్లలోనే దళితుడైన డిప్యూటీ సీఎంను సీఎం మారిస్తే ఎందుకు మాట్లాడకుండా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ వ్యవహారం పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.ఇన్నాళ్లు చప్పుడు చేయకుండా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వారు అంటున్నారు.

Telugu Cm Kcr, Congress, Dalit Cm, Mariyamma Lock, Sc St Attrocity, Telangana, U

ఈ మూస ధోరణుల వల్ల కాంగ్రెస్ కు ఒరిగేదేం లేదని ఓపెన్ గానే చెబుతున్నారు.కాంగ్రెస్ నాయకులు మైండ్ సెట్ మార్చుకోకపోతే… కాంగ్రెస్ మరింత పతనమవుతుందని హెచ్చరిస్తున్నారు.

దళిత మహిళ ఎపిసోడ్ తో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదని వారు అంటున్నారు.ఇప్పటికే సీఎం సదరు మహిళకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారని… ఈ విషయంపై ఎంత మాట్లాడిన ప్రయోజనం లేదని అంటున్నారు.

మాట్లాడాల్సిన సమయంలో కాకుండా ఇప్పుడు మాట్లాడటం వల్ల ప్రయోజనం సమకూరదని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube