ఒకప్పుడు భార్య-భర్తలు కలిసి థియేటర్ లో సినిమా చూసే అవకాశం లేదట తెలుసా?.బాల్కనీకి ఓ స్పెషలిటీ కూడా!

నా చిన్నతనంలో మా ఊళ్ళో రెండే సినిమా టాకీసులు ఉండేవి,వాటిలో దాదాపు హిందీ సినిమాలు మాత్రమే ఆడేవి,ఎప్పుడో గాని తెలుగు సినిమాలు వచ్చేవి కావు,తెలుగు సినిమాలు చూడాలనుకుంటే,నిజామాబాద్ కో,హైదరాబాద్ కో,పోయి చూసే వాళ్ళం.మా ప్రాంతంలో “పర్దా సిస్టం “,ఉండేది,భార్యాభర్తలు కలిసి సినిమా చూసేవారు కాదు,అంటే కలిసి వెళ్ళినా,లేడీస్ ఎంట్రన్స్‌ వేరుగా ఉండేది,ఎవరికి వారు సపరేట్ గా టికెట్లు కొనాల్సిందే,ఇక బాల్కనీ మొత్తం మహిళలకే,భార్య బాల్కనీ లొ కూచుని సినిమా చూస్తే,భర్త ఎక్కడో, బాల్కనీ కి కింద పురుషుల కొరకు కేటాయించిన సీట్లో కూచుని చూసేవాడు,.

అంతేనా అంటే ఇంకా ఉంది.

బాల్కనీ లో కూచున్న మహిళలను,కింద కూర్చున్న పురుషులు చూడకుండా మొత్తం బాల్కనీ కవర్ అయ్యేట్టు,అడ్డంగా ఒక పెద్ద కర్టన్ వేసే వారు,అందరూ కూచున్న తరువాత,థియేటర్ లో లైట్లు, ఆర్పేసిన తరువాత, ఆ బాల్కని కి అడ్డంగా ఉన్న కర్టన్ ను పట్టుకున్న ఒక పిల్లవాడు,ఆ మూల నుండి ఈ మూల వరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి జరిపేవాడు,సేం సీన్ ఇంటర్వెల్ కు ముందూ,తరువాత రిపీట్ అయ్యేది,ఒకవేళ ఏవరైనా పిల్లలతో వస్తే,పదేళ్ళ లోపు వారినే,బాల్కనీ లో తన తల్లితో పాటు కూచునే అవకాశం ఉండేది.ఒకప్పుడు మా ఊళ్ళో,”లేడీస్ పార్క్”,అని సపరేట్ గా ఉండేది,ఎప్పుడైనా కాస్త సేద తీరుదామని వెళ్తే భార్యను ,పిల్లలను లేడీస్ పార్క్ దగ్గర వదిలేసి,భర్త,అయితే “గాంధీ పార్క్”,పురుషుల పార్క్ కు వెళ్ళేవాడు,.ఇవన్నీ తలనొప్పులు అవసరమా అనుకుని, భార్య తన స్నేహితురాళ్ళతో మార్నింగ్ షోకు,భర్త తన మిత్రులతో సెకండ్ షో కు వెళ్ళడం జరిగేది.

ఇప్పుడు ఆ లేడీస్ పార్కూ లేదు,ఆ రూల్సూ లేవనుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube