పెద్దాయన చివరి కోరిక.. నువ్వు తోపు అంటోన్న మందుబాబులు

చావు అంచున ఉన్న ముసలివారు తమ మనవళ్లు, మనవరాళ్ల వివాహం చూసి కన్ను మూయాలని కోరుతుంటారు.కానీ అమెరికాలో ఓ వృద్ధుడు ఆసుపత్రి మంచంపై చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ ఆయన కోరిన ఆఖరి కోరిక విని అక్కడున్నవారు విస్తుపోయారు.

 Old Man Last Wish To Drink Beer On Hospital Bed-TeluguStop.com

ఇంతకీ ఆ వృద్ధుడు కోరిన ఆ చివరి కోరిక ఏమిటి అనుకుంటున్నారా? తన కొడుకులు, మనవళ్లతో కలిసి బీరు తాగాలని ఉందని ఆ పెద్దాయన తెలిపాడు.

ఇది విన్న ఆ ముసలాయన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురైనా ఆయన ఆఖరి కోరిక అని చెప్పడంతో దాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు.

దీంతో పెద్దాయన కొడుకులు అందరూ కలిసి బీరు బాటిళ్లు తెచ్చి తమ తండ్రితో కలిసి ఆసుపత్రిలోనే తాగారు.ఇది చూసిన ఓ మనవడు తన తాత కోడుకులతో కలిసి చివరి కోరికను తీర్చుకుంటున్న వేడుకను ఫోటో తీసాడు.

అతికాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది.

ఇక పెద్దాయన చిలిపి కోరికకు యువత ఫుల్ ఫిదా అయ్యారు.

చచ్చేటప్పుడు కూడా ఆనందంగా చనిపోవాలని ఆయన నిరూపించాడంటూ వారు పెద్దాయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అటు మందుబాబులు మాత్రం ఆ పెద్దయాన నిజంగా తోపు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube