గవర్నమెంట్‌ ఇచ్చిన ఫోన్‌ ఒక వృద్దుడు సజీవ దహనం అయ్యేలా చేసింది.. ప్రభుత్వం పనులు ఇలాగే ఉంటాయంటూ విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగం తప్ప ప్రభుత్వం నుండి వచ్చే ఏ వస్తువు అయినా, ఏ విషయమైన భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా, పెద్దగా కాస్టిది కాకుండా ఉంటుంది.తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఫోన్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది.

 Old Man Died Due To Cell Phone Blast In Rajasthan-TeluguStop.com

పేదల కోసం రాజస్థాన్‌ సర్కార్‌ ఇచ్చిన పదకొండు వంద రూపాయల ఫోన్‌లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి.ఆ విషయం గతంలోనే కొందరు హెచ్చరించారు.

కాని ప్రభుత్వం పట్టించుకోకుండా అవే నాణ్యత లేని ఫోన్‌లను అందజేసింది.ఇప్పుడు అదే ఫోన్‌ ఒక మనిషి ప్రాణం తీసింది.

ఒక వృద్దుడు రాజస్థాన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్‌ను జేబులో పెట్టుకుని బయటకు వెళ్లాడు.అప్పటి వరకు చార్జ్‌ పెట్టి ఉన్న ఫోన్‌ను అతడు తీసుకుని బయటకు వెళ్లాడు.అప్పటికే ఆ ఫోన్‌ వేడిగా అయ్యి ఉంటుంది.ఆ ఫోన్‌ను జేబులో పెట్టుకుని కొద్ది దూరం వెళ్లేప్పటికి ఆ ఫోన్‌ నుండి చిన్న చిన్నగా మంటలు రావడం మొదలయ్యాయి.

విషయాన్ని గమనించని ఆ వృధ్దుడు అత్యంత దారుణంగా సజీవ దహణం అయ్యాడు.ఏకంగా 90 శాతం కాలిపోయాడు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషయం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్‌ అయ్యింది.ప్రభుత్వం అందించిన ఆ మొబైల్‌ కంపెనీ ఏంటీ అనేది క్లారిటీ రాలేదు.ఇపపటికైనా ప్రభుత్వం ఆ పదకొండు వందల ఫోన్‌లను రిటర్న్‌ తీసుకుని మంచి ఫోన్‌లను ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.మరి కొత్తగా ఏర్పాటు అయిన రాజస్థాన్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

చనిపోయిన వృద్దుడికి ప్రభుత్వం సాయం ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube