హర్యానా క్వీన్ డ్యాన్స్‌‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్న ముస‌లాయ‌న‌.. వీడియో వైర‌ల్‌

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా తమ నైపుణ్యాన్ని బయటపెడుతుంటారు.అది పాటైన కావొచ్చు లేక డ్యాన్స్ అయిన కావొచ్చు.

 Old Man Competing For Haryana Queen Dance Video Goes Viral, Old Man Dance, Viral-TeluguStop.com

తమకు వచ్చిన విధంగా చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటారు.ఏదైనా మంచి  ఉర్రూతలు ఊగించే సాంగ్ వినబడిందంటే దాన్ని అనుకరించి పాడడమో లేక డ్యాన్స్ చేయడం కొందరికి సరదా.

మరికొందరికైతే డ్యాన్స్ వేయాలని అనిపించినా చూసేవారు ఏమనుకుంటారోనన్న భయం, సిగ్గుతో తమ కోరికలను అణచివేసుకుంటారు.అయితే కొందరు మాత్రం ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న భావనతో తనకు తోచింది చేస్తుంటారు.

ఇలానే ఓ వృద్ధుడు చేసిన డ్యాన్స్‌కు అక్కడ ఉన్న వారు ఫిదా అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి.స్వప్నా చౌదరి.

సోషల్‌ మీడియా వచ్చాక ఈమె చాలా ఫేమస్ అయింది.ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

హర్యానా  రాణిగా ఎంతో పాపులారిటీ సంపాదించింది.ఈమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఇటీవల ఆమె ఓ బహిరంగా కార్యక్రమంలో పాల్గొని ఓ పాటకు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.ఈమె స్టేజీపై డ్యాన్స్ చేస్తుంటే.

ప్రేక్షకుల మధ్య ఉన్న ఓ వృద్ధుడు పైకి లేచి డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు.ఒకపక్క స్వప్నా చౌదరి.

మరోపక్క ముసలాయన డ్యాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్నవారు చపట్లు, విజిల్లతో హోరెత్తించారు.స్వప్నా కూడా ముసలాయన డ్యాన్స్‌కు ఫిదా అయింది.

అంత లేట్ వయస్సులో ఆ పెద్ద మనిషి స్టెప్పులతో ఇరగదీశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ముసలాయ చేసిన డ్యాన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాను తెగ హోరెత్తిస్తున్నారు.

ముసలాయన  స్టెప్పులు చాలా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube