అధికార ప్రతి పక్ష పార్టీలు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో హోరా హోరీగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.నేడు హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిదిలో ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది.
తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎంతో కట్టుదిట్టంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది.సమస్యాత్మకమైన ప్రాంతలో ప్రత్యేకమైన చర్యలను తీసుకుంటుంది.
ఎక్కడ ఏ ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా, దొంగ ఓటింగ్ లకు పాల్పడకుండ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేసింది.
కానీ ఓల్డ్ మలక్ పేట లో 1,2,3,45, కేంద్రాలలో ఓటింగ్ నిలిపి వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
దీనికి గల కారణం ఏమిటి అంటే బ్యాలెట్ పత్రంలో గుర్తులు తారుమారు కావడం.సిపిఐ పార్టీ అభ్యర్థి గుర్తుకు ఎదురుగా సిపిఎం పార్టీ గుర్తు ముద్రించారు.అందుకే ఆ ప్రాంతంలో ఓటింగ్ నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.జిహెచ్ఎంఎస్ ఎన్నికలను టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది.
బిజేపి, కాంగ్రెస్ పార్టీల రాజకీయ భవిష్యత్తు హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికలపై ఆధారపడి ఉన్నది.