ఆన్‌లైన్‌లో పాత నోట్లకు భారీ డిమాండ్‌.. ఆ నోట్లు ఎవరు కొంటున్నారు, ఎంతకు కొంటున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు

కొత్త ఒక వింత.పాత ఒక రోత అనే సామెత మన తెలుగులో చాలా ఫేమస్‌.

 Old Indian Note Have Demand In Social Meadia1-TeluguStop.com

కాని కొన్ని విషయాల్లో చూస్తే మాత్రం పాతను రోత అనడం చాలా తప్పు అనిపిస్తుంది.కొత్త వాటికి ఉన్న విలువ కంటే పాత వాటికే ఎక్కువగా ఉంటుంది.

కొన్ని సార్లు చూస్తుంటే అప్పుడు మనం అశ్రద్ద చేసినందుకు అయ్యో అనుకుంటాం.కొన్నాళ్ల క్రితం కనిపించకుండా పోయిన వెయ్యి మరియు అయిదు వందల రూపాయల నోట్లకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది.

ఆ నోట్ల రద్దు సమయంలో ఎవరి వద్దనైనా రెండు మూడు నోట్లు ఉంటే అయ్యో వృదా అవుతున్నాయే అంటూ బ్యాంకులకు పరుగెత్తడం జరిగింది.ఒక్కటి రెండు నోట్లు కూడా ఉంచుకోకుండా అన్ని కూడా బ్యాంకులో జమ చేయడం జరిగింది.కాని ఇప్పుడు ఆ నోట్లను చూడాలనిపిస్తే గూగుల్‌లో చూడాల్సిన పరిస్థితి.కొందరు మాత్రం నోట్లను, కాయిన్స్‌ను కలెక్ట్‌ చేయాలనే హ్యాబిట్‌తో ఆ నోట్ల కోసం వెదుకుతున్నారు.ఇప్పటికే దాదాపుగా కనుమరుగయ్యాయి అనుకుంటున్న నోట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

ఎవరి వద్దనైతే ఆ నోట్లు ఉన్నాయో వారు వాటిని భారీ మొత్తంకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ అయిన ఈబె మరియు ఇంకా కొన్ని సంస్థల్లో 500 రూపాయల నోట్లు మరియు 1000 రూపాయల నోట్లను అమ్మేందుకు ఆన్‌లైన్‌లో ఉంచారు.వాటి విలువ కూడా బాగానే ఉంది.

ఇప్పటికే చాలా నోట్లు అమ్ముడు పోయినట్లుగా వారు చెబుతున్నారు.పాత నోట్లను కలెక్ట్‌ చేసే అభిరుచి ఉన్న వారు కాస్త ఎక్కువ మొత్తం అయినా పర్వాలేదు అని ఆ నోట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అప్పుడు చేతిలో ఉన్న వాటిని పోగొట్టుకుని ఇప్పుడు వాటినే మళ్లీ కొనుగోలు చేస్తున్నారు జనాలు.ఇదే చిత్రమైన విచిత్ర పరిస్థితి అంటే.ఎవరైతే పాత నోట్లను దాచి పెట్టి ఇప్పుడు అమ్ముతున్నారో వారు మంచి తెలివైన వారిగా చెప్పుకోవచ్చు.డబ్బులను డబ్బులకే అమ్ముతున్న వారి తెలివికి హ్యాట్సాప్‌.

ఇండియాలో ఇండియన్‌ కరెన్సీని అమ్మడం చట్ట విరుద్దం.అయితే అవి విదేశీ వెబ్‌ సైట్లలో ఉన్న కారణంగా ఇబ్బంది ఉండదని కొందరు భావిస్తున్నారు.

ఒకటి రెండు నోట్లను అమ్మితే ఇబ్బందేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి 500 మరియు 1000 నోట్ల కు రెక్కలు రావడంతో రేట్లు భారీగా పెరిగి పోయాయి.

మీ వద్ద కూడా ఏమైనా పాత నోట్లు ఉంటే వాటిని అమ్మి క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube