టీడీపీకి పాత‌రోజులు.. బాబు క‌స‌ర‌త్తు ఫ‌లించేనా..?

రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా గెలుపు ఓట‌ము స‌హ‌జం.ఆత్మ‌గౌర‌వ నినాదంతో ప్ర‌జ‌ల‌ను ఏక‌ప‌క్షంగా త‌న వైపు తిప్పుకొన్న అన్న‌గారు ఎన్టీఆర్ కూడా ఎన్నిక‌ల్లో గెలుపుతోపాటు ఓట‌మిని కూడా చ‌విచూడాల్సి వ‌చ్చింది.

 Old Days For Tdp Chandrababu Stratagey Workout , Chandrababu, Tdp, Ysrcp, Jagan,-TeluguStop.com

సో.ఎలాంటి వారికైనా గెలుపు-ఓట‌ములు స‌హ‌జం.అయితే, ఎందుకు గెలిచామో.స‌హ‌జంగానే ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు.అంతా త‌మ ఖాతాలోనే వేసేసుకుంటారు.కానీ, ఓట‌మి త‌ర్వాత మాత్రం ఒక్క‌సారిగా పోస్టు మార్ట‌మ్ చేప‌డ‌తారు.

ఇది కూడా స‌హ‌జ‌ప్ర‌క్రియే.ఇప్పుడు టీడీపీలోనూ ఇదే త‌ర‌హా పోస్టు మార్టం జ‌రుగుతోంది.

ఇది చాలా అత్య‌వ‌స‌ర‌మైన‌.అత్యంత అవ‌స‌ర‌మైన విష‌యం.

ఎందుకంటే.గ‌త ఏడాది ఎన్నిక‌లు.టీడీపీకి ప్రాణ స‌మానం.అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క‌సారి గెలిపించండి.అని ఎన్నిక‌ల‌కు ఒక‌టి రెండు రోజులముందు ప్ర‌జ‌ల‌కు వంగి వంగి దండాలు పెట్టి మరీ అభ్య‌ర్థించారు.

దీనికి కార‌ణం.కీల‌క‌మైన అమ‌రావ‌తి ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ఆయ‌న ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డ‌మే.

స‌రే.ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు.

అయితే, ఊహ‌కు కూడా అంద‌ని రేంజ్‌లో ఓట‌మి పాల‌వ‌డ‌మే బాబును తీవ్రంగా క‌లిచి వేసింది.ఓడిపోయినా.

క‌నీసం 50-70 స్థానాల్లో అయినా టీడీపీ పుంజుకుంటుంద‌ని భావించారు.

కానీ, కేవ‌లం 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది.

పోనీ.వారైనా బాబుకు మ‌ద్ద‌తుగా ఉన్నారా? అంటే.లేరు.ఒక్కొక్క‌రుగా జారిపోతున్నారు.నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా మోసే నాయ‌కుడు కూడా క‌నిపించ‌ని స్థాయికి పార్టీ దిగ‌జారిపోయింది.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి?  పార్టీని ఎలా నిల‌బెట్టాలి? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తున్నాయి.ఈ క్రమంలోనే చంద్ర‌బాబు గ‌త ఓట‌మిపై పోస్టు మార్టం చేప‌ట్టారు.పార్టీకి ఆది నుంచి ఎవ‌రు అండ‌గా ఉన్నారు.ఎవ‌రు దూర‌మ‌య్యారు.ఎందుకింత‌గా పార్టీ దిగ‌జారింది.

ఇప్పుడు ఏం చేయాలి?  అనే అంశాల‌ను ఆయ‌న ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు తెలిసిన కీల‌క విష‌యం.

ఆది నుంచి పార్టీకి అండ‌గా ఉన్న బీసీ సామాజిక వ‌ర్గాల‌ను తాను దూరం చేసుకున్నాన‌ని.అదేస‌మ‌యంలో ద‌ళితుల‌ను కూడా తాను దూరం పెట్టాన‌ని! ఇక‌, త‌న సామాజిక వ‌ర్గానికి గ‌డిచిన ఐదేళ్ల అధికారం స‌మ‌యంలో మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మేన‌ని తెలుసుకున్నారు.

ఆయా వ‌ర్గాలు దూరం కావ‌డం వ‌ల్లే.తాము న‌ష్టపోయామ‌ని గుర్తించారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఎక్క‌డ ద‌ళితుల‌పై దాడులు జ‌రిగినా.ఎక్క‌డ బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని భావించినా.

ప్రాంతీయ భావాలు లేకుండా బాబు రెచ్చిపోతున్నారు.రాబోయే రోజుల్లో పార్టీలోనూ వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రి ఈ వ్యూహం మేలు చేస్తుందా?  పార్టీకి పునఃవైభవం వ‌స్తుందా?  బాబు సీఎం అవుతారా?  చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube