430 రూపాయిల వస్తువు ఆరు కోట్లకి అమ్ముడుపోయింది

కొన్ని కళా ఖండాలకి కాలంతో పాటు విలువ పెరుగుతూ వస్తుంది.చాలా మంది ధనవంతులు ప్రాచీన కాలం నాటి వస్తువులని సేకరించడం అలవాటుగా చేసుకుంటారు.

 Old Chess Piece Bought For Rs 430 Was Just Sold For Rs 6 Crore1-TeluguStop.com

వాటి కోసం ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెట్టడానికి వెనుకాడరు.అప్పుడప్పుడు ప్రపంచంలో ఏదో ఒక మూల నిర్వహించే వేలం పాటలో పాతకాలం నాటి వస్తువులు కోట్ల రూపాయిలకి అమ్ముడుపోయిన సంఘటనలు చూస్తూ ఉంటాం.

ఇప్పుడు అలాంటి సంఘటన మరొకటి జరిగింది.ప్రాచీన కాలానికి చెందిన ఒక చదరంగం పావు లండన్‌లో జరిగే వేలంపాటలో ఏకంగా 6 కోట్లకు అమ్ముడుపోయింది.

ఆరు కోట్ల రూపాయిలకి అమ్ముడుపోయిన ఈ వస్తువుని కొన్న వ్యక్తి దీన్ని 1964లో కేవలం ఐదు పౌండ్లంకు కొన్నాడు.లండన్‌లోని సౌత్‌బేలో జరిగిన వేలంపాటలో మరో వ్యక్తి ఈ పావుని 7.5 లక్షల పౌండ్లకు దక్కించుకున్నాడు.12వ శతాబ్దంలో నివశించిన సముద్ర జంతువు దంతంతో ఈ చెస్ పావుని తయారు చేశారని సమాచారం.800 నుంచి 1066 మధ్యకాలానికి చెందిన ఈ కళాకృతులకు ఎంతో విలువ ఉంది.1830ల కాలంలో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్ లెవిస్‌లో ఐదు సెట్ల చెస్ పావులు దొరికాయి.అప్పటి నుంచి చేతులు మారిన ఈ చెస్ పావు ఇన్నేళ్లకు లండన్‌లోని వేలంపాటకు వచ్చింది.స్కాట్లాండ్ డీలర్ అప్పట్లో దీనికి కేవలం 430 రూపాయిలకే కొన్నాడు.కాని ఇప్పుడు ఏకంగా ఆరు కోట్లకి అమ్ముడుపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube