పాత బిల్డింగ్ నేలమట్టం.. ధ్వంసమైన కార్లు !

ఇటీవల కురుస్తున్న వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలు నేలమట్టం అవుతున్నాయి.ఎన్నో ఇళ్లు కూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం.

 Madya Pradesh, Old Building, Demolished, Cars-TeluguStop.com

తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ పాత బిల్డింగ్ శ్లాబ్ కూలడంతో కింద పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి.ఘటనా స్థలంలో ఎవరూ లేని కారణంగా ప్రాణ నష్టం జరగలేదు.

సమాచారం అందుకున్నవిపత్తు శాఖ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

భోపాల్ లోని మోతీమహల్ సదర్ ఆలయం పార్కింగ్ ప్రాంతంలో ఓ శిథిలావస్థకు చేరిన భవనం ఉంది.అయితే గత కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బిల్డింగ్ మొత్తం పదను పారింది.

మట్టితో కట్టిన పాత కాలం భవనం కావడంతో కుప్పకూలింది.దీంతో భవనం కింద పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసమయ్యాయి.

అదృష్టవశాత్తు భవనం కూలే సమయంలో కారు దగ్గర్లో డ్రైవర్లు ఎవరూ లేరు.దీంతో ప్రాణ నష్టం కానీ ఎవరూ గాయాలపాలు కాలేదు.

సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు శాఖ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు.పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube