రద్దైన పాతనోట్లను ఇప్పుడు డబ్బులిచ్చి మరీ కొంటున్నారంట.? ఎందుకో తెలుసా.?

ఏ ముహూర్తాన పెద్ద నోట్లు రెడ్డయ్యయ్యో…అప్పటి నుండి మనకి నోట్ల తిప్పలు మొదలయ్యాయి.ఎటిఎం ల ముందు బారులు తీసాము.

 Old And New Rs 500 Notes Being Sold On Ebay-TeluguStop.com

ఇప్పటికి చాలా వరకు ఎటిఎం లలో డబ్బులు రావట్లేదు.అయితే నోట్లు రద్దైన సమయంలో మనం పాత నోట్లు మార్చుకోడానికి చాలానే కష్టపడ్డాము.

కానీ ఇప్పుడు అవే పాతనోట్లను డబ్బులిచ్చి మరీ కొనుకుంటున్నారంట.? ఎందుకో తెలుసా.?

‘ఇ-బే’లో ఈ పాత నోట్లను 6 డాలర్ల(రూ.423)కి అమ్ముతున్నారు.అమెరికాలో నివసిస్తున్నట్లు చెప్పుకొంటున్న ఓ వ్యక్తి ఇ-బేలో ఈ పాత రూ.500 నోట్లను అమ్మకానికి పెట్టాడు.ఇప్పటికే 15 పాత నోట్ల అమ్ముడు పోయాయి.మరో తొమ్మిది మాత్రమే మిగిలున్నాయి.త్వరపడండి అంటూ ప్రకటన కూడా చేస్తున్నాడు.అయితే పనికిరాని ఈ నోట్లను జనాలు డబ్బులిచ్చి మరీ ఎందుకు కొంటున్నారు.?

పాత కరెన్సీని, కాయిన్స్‌ని సేకరించే అలవాటు ఉన్న వారే ఇలా కొంటుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇలా పాత కరెన్సీని కొనడం ఇదేమి కొత్త కాదు.

గతంలో కూడా చాలాసార్లు ఇలా జరిగింది.అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా కరెన్సీ ట్రేడింగ్‌ చేయడం నేరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube