నీ వయసేంటి ..? ఆ మార్కులేంటి..? ఓ బామ్మా ... నువ్వు సూపరంతే !

బలమైన సంకల్పం ఉండాలి కానీ … అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు అనే మాటలను నిజం చేసి చూపించింది కేరళలోని ఓ లేటు వయస్సు మూసలమ్మ.సెంచరీ కొట్టేందుకు చేరువలో ఉన్న ఈ బామ్మ.

 Old Adege Kerala Woman Tops Literacy Mission Exam-TeluguStop.com

ఎగ్జామ్‌లో మాత్రం సెంట్‌ పర్సెంట్‌ స్కోర్‌ చేసి టాపర్‌గా నిలిచింది.దాంతో ఈ బామ్మ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదగా రేపు (గురువారం) మెరిట్‌ సర్టిఫికెట్ అందుకోనుంది.

వివరాలు.కేరళ అలప్పుజ జిల్లా ముత్తం గ్రామానికి చెందిన కార్థియాని అమ్మ(96)… ఆలయాల్లో శుభ్రం చేస్తూ జీవనం గడిపేది.

బాల్యంలో బడి ముఖం చూడని ఈ బామ్మ చదువుపై మక్కువతో కేరళ ప్రభుత్వ ప్రారంభించిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది.

రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధించేందుకుగాను కేరళ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షరతా మిషన్‌లో భాగంగా ఈ ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాలుగు, ఏడు, పది, ఇంటర్‌ తరగతులకు సంబంధించి దాదాపు 42, 933మంది పరీక్షలు నిర్వహించారు.కార్థియాని అమ్మ నాలుగో తరగతి పరీక్షలకు హాజరయ్యింది.

అంతేకాక ఈ పరీక్షలో ఆమె 98 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది.ఈ విషయం గురించి బామ్మ మాట్లాడుతూ.

‘నేను ఇప్పుడు చదవగలను, రాయగలను లెక్కలు కూడా చేయగలను.అంటూ కేరింతలు కొడుతోంది ఈ బామ్మ !

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube