ఓలా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..!

ఇన్నాళ్లు ట్యాక్సీ సేవలు అందుస్తూ వస్తున్న ఓలా సంస్థ నుండి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నాయి.వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టిన ఓలా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రాధాన్యత ఇచ్చింది.

 Ola Releasing New Electric Scooters, New Electric , Ola , Releasing,  Scooters,-TeluguStop.com

ఇప్పుడు అన్ని వాహన కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే పనిలో ఉన్నారు.ఈ క్రమంలో ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఓలా నుండి వస్తున్న మొదటి ఎలెక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ చేస్తుంది.జూలైలో ఇండియాలో ఈ స్కూటర్స్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది.400 సిటీస్ లో లక్ష ఛార్జింగ్ పాయింట్లతో హైపర్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫస్ట్ ఇయర్ ఇండియాలో 100 సిటీస్ లో 5 వేల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

హైస్పీడ్ ఓలా ఛార్జింగ్ పాయింట్లు కేవలం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకునేలా చూస్తున్నారట.ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని అంటున్నారు.

రాబోతున్న ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్స్ ఇండియాలో ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పుడిప్పుడే ఎలెక్ట్రిక్ వెహికల్స్ వాడటం మొదలైంది.రానున్న రోజుల్లో అన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ తో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలీజ్ చేస్తారని చెప్పొచ్చు. దానికి తగినట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నారు మోటార్ కంపెనీలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube