మీకు తెలుసా? ఓలా స్కూటర్ కోసం ఇపుడు ఏడాదికి రూ.1999 కడితే సరిపోతుంది!

ప్రస్తుతం జనాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.దానికి కారణం మీకు తెలిసినదే.

 Ola Electric Scooter Launches Customer Service Subscription Plans Details, Ola S-TeluguStop.com

దేశంలో ఆయిల్ రేట్స్ ఆకాశాన్నంటున్నవేళ సగటు సామాన్యుడు డీసెల్, పెట్రోల్ కనలేని పరిస్థితి ఏర్పడింది.దాంతో ఇంతవరకు లేని మార్పులు భారీగా చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలోనే అనేక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని స్టార్ చేసాయి.అందులో ఓలా కంపెనీ ఒకటి.

తాజాగా ఓలా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చింది.అవును, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola) కొనుగోలుదారుల కోసం ఈ కొత్త ప్లాన్స్‌ను తీసుకువచ్చింది.

Telugu Latest, Ola Care, Olaelectric, Ola Scoter, Ups-Latest News - Telugu

రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తాజాగా ఆవిష్కరించింది.వారి పేర్లు “ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్.” ఓలా కేర్ ధర ఏడాదికి రూ.1999గా ఉంటే, ఓలా కేర్ ప్లస్ ధర ఏడాదికి రూ.2,999గా వుంది.అయితే దీనికి జీఎస్‌టీ (GST) అదనంగా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ హోమ్ సర్వీసింగ్ కూడా లభిస్తుంది.మీ ఇంటి వద్దకే వచ్చి ఓలా స్కూటర్ తీసుకెళ్లి సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఇంటికి స్కూటర్‌ను తిరిగి తెచ్చిస్తారు.

Telugu Latest, Ola Care, Olaelectric, Ola Scoter, Ups-Latest News - Telugu

అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టకుండానే పని అయిపోతుందన్నమాట.అలాగే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ వంటి పరిస్థితుల్లో కూడా కస్టమర్లకు ఉచితంగానే కన్సూమబుల్ రీప్లేస్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం.ఇక ఓలా కేర్ ప్లస్ ప్లాన్ ద్వారా అయితే వార్షిక సమగ్ర డయాగ్నసిస్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ, ఫ్రీ కన్సూమబుల్స్, 24 గంటలు డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీస్ వంటివి అనేకం పొందొచ్చు.ఇంకో గమ్మత్తైన విషయం ఏమంటే, వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్ డౌన్ అయితే అక్కడ హోటల్ అకామోడేషన్ ఉచితంగానే లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube