తన కస్టమర్స్ కు శుభవార్త ప్రకటించిన ఓలా..!

ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సర్వీసులు బాగా ఎక్కువగా పెరిగిపోయాయి.ఇంట్లో కూర్చుని ఫోన్లో ఒక క్లిక్ ఇస్తే చాలు నిమిషాల్లో మీరు కోరిన వస్తువు మీ ఇంటి ముందు వచ్చి వాలిపోతుంది.

 Ola ,begins, Pilot Of Quick, Grocery Delivery ,service,latest News,social Media-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రముఖ క్యాబ్‌ సర్వీసు సంస్థ అయిన ఓలా కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందుకు దూసుకుపోతున్న ఓలా మళ్ళీ ఇప్పుడు నిత్యావసర సరకుల డెలివరీ విషయంలో కూడా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తుంది.

అయితే ఓలా కంపెనీ ముందుగా ఈ కిరాణా పైలట్ ప్రాజెక్టును బెంగళూరులోని కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రారంభిస్తుందని తెలిపింది.ఆ తర్వాత రాబోయే రోజుల్లో భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్ట్ ను విస్తరించనున్నట్లు సమాచారం.

నిత్యావసర సరకులు, పర్సనల్ కేర్‌, పెట్‌ కేర్ వంటి వస్తువులకు సంబంధించిన సేవలను ఓలా అందించనుంది.కాగా ఈ విషయంమై ఓలా అధికారులు ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు.

కాగా ఓలా యాప్‌ లోనే ఈ ఓలా స్టోర్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.వివిధ రకాల కేటగిరీల్లో మొత్తం 2,000 సరకులు అందిస్తున్నట్లు సమాచారం.

Telugu Latest, Pilot-Latest News - Telugu

నగరంలోని కీలక ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న దుకాణాల నుంచి వీటిని పంపిణీ చేస్తామని ఆ వర్గాలు తెలిపాయి.వినియోగదారులు ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లోనే సరకులు అందించాలని లక్ష్యంగా సేవలు పెట్టుకున్నట్లు పేర్కొన్నాయి.సాధరణంగా ఇలాంటి నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రి డెలివరీ చేయాలంటే మినిమమ్ ఒక రోజు అయిన సమయం పడుతుంది.కానీ అతి తక్కువ సమయంలోనే ఓలా వస్తువులను చేరవేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.

ఇప్పటికే ఈ రంగంలో డుంజో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌, రిలియన్స్ మార్ట్ ఇలాంటి ఎన్నో సంస్థలు సేవలు అందిస్తున్నాయి.ఇప్పుడు ఓలా కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది.మరి ఓలా రాబోయే రోజుల్లో వినియోగదారులను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube