మాస్ కథతో 'ఒక మనసు' దర్శకుడు..!

తెలుగులో పొయెటిక్ వేలో సినిమాలు చెప్పే దర్శకులు చాలా తక్కువ.అయితే అలాంటి సినిమాలు అన్ని సమపాళ్లలో కుదిరితేనే ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతాయి లేదంటే మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు సినిమాల్లా ఫ్లాప్ బాట పడతాయి.

 Oka Manasu Director Next A Mass Love Story-TeluguStop.com

రామరాజు డైరెక్ట్ చేసిన ఒక మనసు మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ప్రేమకథలనే హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించే రామరాజు రెండు సినిమాలతో సక్సెస్ ను అందుకోలేకపోయాడు.

అందుకే ఈ సారి ఓ కమర్షియల్ హిట్ కొట్టే ప్రేమకథ తెరకెక్కిస్తాడట.ఒక మనసు నిర్మాత మధురా శ్రీధర్ మరో సినిమా రామరాజుతో కమిట్ అవుతున్నట్టు ఎనౌన్స్ చేశాడు.

ఇప్పుడు ఆ సినిమా పేరు ‘చీకటి ప్రేమకథ’ అనే టైటిల్ పెడుతున్నారట.త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారట కూడా.

ఒక మనసు నిరాశ పరచడంతో రామరాజు తన ఆలోచన మార్చుకుని ఈసారి మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఈ ప్రేమకథను రాసుకున్నాడట.మరి ఈ చీకటి ప్రేమకథ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో సినిమా వస్తేనే గాని తెలుస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube