టీకా వేసుకుంటే ఏకంగా రూ.7.3 కోట్ల లాటరీ..! ఎక్కడంటే..?!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టిన వాటిని తీసుకోవడానికి చాలామంది నిరాసక్తత చూపిస్తున్నారు.ప్రజలకు అండగా నిలవాల్సిన కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 Ohio Governor Mike Dewine Offering One Million Dollars Lottery For Taking Corona Vaccination-TeluguStop.com

అయితే ఇలా వాక్సినేషన్ వేయించుకోవడం ఇష్టం లేకుండా ఉండటం చాలా ప్రమాదకరమని అమెరికా సిడిసి చీఫ్ ఆంతోని ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఈ విషయంలో రిపబ్లిక్ ప్రజలు చాలా ఆ శ్రద్ధ వహిస్తున్నారని, వారి మద్దతుదారులను టీకా వేయించుకోవలిసిందిగా వారు కోరాలని అమెరికా దేశపు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఆయన అభ్యర్థించారు.

పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అనేక పాట్లు పడుతోంది.ఈ నేపథ్యంలో ప్రజలు వేయించుకోవడానికి ముందుకు వచ్చేలా అనేక ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతోంది ఆదేశ ప్రభుత్వం.

 Ohio Governor Mike Dewine Offering One Million Dollars Lottery For Taking Corona Vaccination-టీకా వేసుకుంటే ఏకంగా రూ.7.3 కోట్ల లాటరీ.. ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగానే ఓహియో గవర్నర్ మైక్ డివైన్ వారి రాష్ట్ర ప్రజలకు ఓ వినూత్న బంపర్ ఆఫర్ ని ప్రకటించాడు.అదేంటంటే.టీకా వేయించుకుంటే ప్రతివారం జరిగే లాటరీలో ఒకరికి ఒక మిలియన్ డాలర్లు బహుమానంగా ఇస్తామని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.అయితే ఇందులో కచ్చితంగా 18 ఏళ్లు నిండిన వారు కనీసం ఒక డోస్ తీసుకున్న వారికే వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం పై చాలా మంది డబ్బు వృధా చేస్తున్నారని తప్పు పట్టినప్పటికీ ప్రజల్లో అపనమ్మకాన్ని చెరిపివేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

లాటరీ మొత్తం ఐదు వారాల పాటు అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగా మొదటి విజేతను మే 26న ప్రకటించబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.ఈ లాటరీ మాత్రమే కాకుండా 17 ఏళ్ల లోపు ఉన్నవారికి ప్రత్యేకమైన లాటరీ కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ లాటరీలో విజేతలుగా ప్రకటించిన వారికి ఒహియో యూనివర్సిటీలలో 4 సంవత్సరాల పాటు వారికి స్కాలర్షిప్లను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

#OfferingOne #7.3 Crores #Usa Corona #OhioUniversity #Mike Dewine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు