విద్యార్థులకు డ్రగ్స్ టెస్ట్: ఒహియో క్యాథలిక్ స్కూల్ సంచలన నిర్ణయం  

Ohio Catholic School Plnas To Drug Testing For All Students-ohio Catholic School,random Drug Testing

అమెరికాలో డ్రగ్స్ వాడకం ఎక్కువ కావడంతో అక్కడి పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఓహియో రాష్ట్రానికి చెందిన ఓ క్యాథలిక్ హైస్కూల్ డ్రగ్స్ మరియు నికోటిన్‌ వాడకాన్ని నిషేధించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలో జనవరి నుంచి విద్యార్ధులందరూ డ్రగ్స్ పరీక్షలను తప్పనిసరిగా చేసుకోవాలని ప్రకటించింది.

Ohio Catholic School Plnas To Drug Testing For All Students-ohio Catholic School,random Drug Testing Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)--Ohio Catholic School Plnas To Drug Testing For All Students-Ohio Random

సిన్సినాటికి ఉత్తరాన 30 మైళ్లదూరంలో ఉన్న హామిల్టన్‌లోని స్టీఫెన్ టి.బాడిన్ హైస్కూల్‌ యాజమాన్యం గత మంగళవారం విద్యార్ధుల తల్లిదండ్రులకు ఒక లేఖ రాసింది.

Ohio Catholic School Plnas To Drug Testing For All Students-ohio Catholic School,random Drug Testing Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు)--Ohio Catholic School Plnas To Drug Testing For All Students-Ohio Random

విద్యార్ధులందరూ ప్రస్తుతం తప్పులు చేసే వయసులో ఉన్నారని.వారిని కొత్తగా నేర్చుకునేలా చేయాలని.ఇందుకు వారి కుటుంబం యొక్క సహాయ సహకారాలు అవసరమన్నారు.కొత్త విధానం ప్రకారం.

విద్యార్ధులందరూ సంవత్సరానికి ఒకసారి డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి.

నిషేధిత పదార్థాలు, ఆల్కహాల్, నికోటిన్ లేదా ఇతర అసురక్షిత పదార్థాలను విద్యార్ధులు వినియోగిస్తున్నారో లేదా అన్నది నిర్థారించడానికి థర్డ్ పార్టీ సంస్థను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లుగా యాజమాన్యం తెలిపింది.ఈ డ్రగ్స్ పరీక్షలో విద్యార్ధి దొరికితే శిక్షలకు గాను మార్గదర్శకాలను రూపొందించింది.ఇందులో మొదటి నేరం ఐదు రోజుల సస్పెన్షన్, రెండవసారి దొరికితే బహిష్కరణ విధిస్తామని అధికారులు తెలిపారు.అలాగే నిషేధిత డ్రగ్స్‌ను విద్యార్ధులు విక్రయిస్తూ పట్టుబడితే పోలీసులకు అప్పగిస్తామని స్కూలు యాజమాన్యం తెలిపింది.