అరెరే.. పోలీసులను చూసి పేడ దిబ్బలో దాక్కున్న దొంగ.. చివరకు..?!

పోలీస్ నుంచి తప్పించుకోవడానికి దొంగలు వివిధ రకాలుగా ప్రయత్నించడం మనం గమనిస్తూనే ఉంటాం.పోలీసుల కళ్లు కప్పి వారి నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి వారు చేయని సాహసం ఉండదు.

 The Thief, Who Saw, Police, Dung Mound ,the Thief Who Saw The Police And Hid In-TeluguStop.com

అయితే అందరి లాగా ఈ దొంగ కూడా అలాగే చేశాడు.కాకపోతే, చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.

ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి అనుకుంటున్నారా.? ఆ దొంగ ఎక్కడ దాక్కున్నాడో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు.ఆవు పేడలోదొంగ పోలీస్ ల చేతికి దొరకకుండా దాక్కోవడానికి ప్రయత్నిచాడు.అయితే ఆ దొంగ అంత తెలివిగా దాక్కున్నాడని మాత్రం అనుకోవద్దు.ఒకవేళ అదే సమయానికి ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు రాకపోతే చివరికి అతడి ప్రాణాలు ఆ పేడలోనే కలిసిపోయేవి.అవును.

ఇంగ్లాండ్ దేశంలోని సక్సెస్ కౌంటీలో ఓ వ్యక్తి కార్ దొంగలించిన తర్వాత ఆ విషయాన్ని పోలీసులు తెలుసుకోవడంతో ఆ దొంగని పోలీసులు వెంబడించారు.ఈ వెంబడించడంతో ఆ దొంగ ఏకంగా ఓ పెద్ద పేడ ఉన్న గోతిలోకి దూకేశాడు.

ఆ గొయ్యి సుమారు 6 అడుగుల పైగా లోతుగా ఉంది.పోలీసులకు కనపడకుండా అందులో దాక్కోవాలని ప్రయత్నించిన దొంగకు చివరికి ఊపిరి ఆడకుండా పోయింది.

ఆ పేడ కంపుతో అతడికి కళ్ళు తిరగడంతో ఆ ఊబిలోనే కూరుకుపోయాడు.అయితే ఆ దొంగ అదృష్టం మేరకు అది పోలీసులు గమనించడంతో అతనిని ఆ గోతి నుండి బయటకు తీశారు.

పోలీసులు దొంగను ఆ పేడ గోతి నుండి బయటకు తీశాక అతడిని శుభ్రం చేయకుండానే బేడీలు వేశారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.దొంగ తాను కంపు భరించలేకపోతున్న స్నానం చేశాక తనిని అరెస్టు చేయండి అని ఎంత గోల పెట్టిన కానీ పోలీసులు వినకుండా అతని చేతులకు సంకెళ్లు వేశారు.ఒకవేళ పోలీసులు ఆ దొంగను చూడకపోయింటే ఈ సమయానికి ఆ దొంగ భూమిమీద బతికి ఉండేవాడే కాదు.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్స్ ఆ దొంగ పోలీసులకు రుణపడి ఉండాలి.లేకపోతే, ఈపాటికి అతడు సమాధి అయిపోయే వాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube