వర్షాకాలం అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు వచ్చే జంతువులు పాములు.ఎందుకంటే ఇవి వర్షాకాలంలో వరద తాకిడి కారణంగా గ్రామాల్లోకి ఎక్కువగా వస్తుంటాయి.సాయంత్రం అయితే చాలు ఇండ్ల ముందు కూడా దర్శనమిస్తుంటాయి.ఇలాంటి వాటితో నిత్యం జనాలు ఇబ్బంది పడుతూనే ఉంటారు.ఇక ఈ మధ్య అయితే చాలా చోట్ల పాములకు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.ఇక కొన్ని సార్లు అయితే ఈ పాముల కారణంగా చివరకు ప్రాణాలు కూడా కోల్పుతున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.
ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వీటికి బలైపోవడం ఖాయం.
ఇక మనకు ఒక్కో సారి కనిపించే ఘటనలు చూస్తే కండ్లను కూడా నమ్మలేకుండా ఉంటాయి.
ఎందుకంటే అవి జరిగిన తీరు చూస్తుంటూనే ఆశ్చర్యం వేస్తుంది.ఇక ఇలాంటి ఆశ్చర్య ఘటన అది కూడా పాముకు సంబంధించినది మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఈ వీడియో చూస్తేనే భయం వేయక మానదేమో.ఎందుకంటే ఓ భయంకరమైన కోబ్రా దగ్గరకు వస్తేనే గుండెలు జారిపోతాయి.
కానీ ఇక్కడ ఏకంగా అది పడుకున్న వ్యక్తి దుప్పట్లోకి దూరంది.కానీ దాని నుంచి ఒక కుర్రాడు తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాడంటే అస్సలు నమ్మలేం.
అయితే మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్ మీద ఓ వ్యక్తి ఓ వ్యక్తి నిద్రిస్తుండగా సడెన్గా అక్కడకు వచ్చిన ఓ పాము అతని దుప్పటిలోకి దూరింది.అది చాలాసేపు అలాగే దుప్పట్లో ఉంది.కాగా గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ఏదో కదులుతున్నట్టు తన శరీరంపై ఏదో పాకుతున్నట్లు స్పర్శ తెలియడంతో వెంటనే లేచి ఏటా అని చూశాడు.ఇంకేముంది పామును చూసి గుండెలు జారాయి.
వెంటనే అతను తేరుకుని పరుగులు పెట్టాడు.కాగా పాము అతన్ని ఇంకా కాటు వేయకపోవడంతో తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాడు.