వామ్మో.. ఈ వీడియోను చూస్తే దెయ్యాలు ఉన్నాయ‌ని న‌మ్మాల్సిందేనేమో..?

ఆధునిక టెక్నాలజీ సైన్స్ ప్రపంచంలో మనం ఉన్నామన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కానీ, ఇప్పటికీ మూఢనమ్మకాలు ఇంకా జనాల్లో ఉన్నాయి.

 Oh My God.. If You Watch This Video, Do You Believe That There Are Devil ..?, De-TeluguStop.com

ఇటీవల కాలంలో ఇందుకు ఉదాహారణలుగా పలు ఘటనలు జరిగాయి.కాగా, దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే క్వశ్చన్ చాలా కాలం నుంచి జనంలో ఉంది.అయితే, కొందరు ఉన్నారని అంటుంటారు.మరికొందరు లేరు అని అంటుంటారు.కాగా, తాజాగా దెయ్యం ఉందని చర్చనే మళ్లీ తెర మీదకు తెచ్చింది ఓ వీడియో. సదరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ఆ వైరల్ వీడియోలో ఖాళీ చైర్‌ను దెయ్యం కదలించిందనే వాదన చేస్తున్నారు కొందరు.వివరాల్లోకెళితే.

సీసీటీవీ కెమెరాలో వీడియో ఇది.ఇటీవల యూకేలోని కార్డిఫ్‌లోని ది లాన్స్‌డౌన్ పబ్ సీసీటీవీలో రికార్డు అయింది.

హాలెట్ బడ్ అనే వ్యక్తి ఎనిమిదేళ్లుగా ఈ పబ్‌ను నడుపుతున్నాడు.ఈ పబ్ లోకి వచ్చే కస్టమర్స్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటాడట.కానీ ఈ పబ్‌లో ఘోస్ట్ ఉందనే కారణం చేత చాలా మంది క్లయింట్స్ ఇక్కడకు రావడమే మానేశారట.వైరలవుతున్న వీడియోలో పబ్‌లో ఓ అమ్మాయి ముందర ఉన్న కుర్చీ ఆటోమేటిక్‌గా మూవ్ అవుతున్నది.

అలా కదలడం చూసి దెయ్యం దాన్ని కదలిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.అయితే, పబ్ మేనేజర్ అయిన యువతి ఈ విషయమయై పబ్ నిర్వాహకులు తెలపగా, వారు సీసీటీవీ రికార్డెడ్ ఫుటేజీ విడుదల చేయగా, ఈ విషయం బయటకు వచ్చింది.అయితే, ఈ వీడియో చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు దెయ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నెటిజన్లు గాలికి చైర్ మూవ్ అయిందనే కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే చైర్ కదిలినట్లు కనిపిస్తున్నది.కానీ, అది దెయ్యం వల్లే అనేలా లేదు.

గాలి వల్ల కూడా లైట్‌గా మూవ్ అయ్యే చాన్సెస్ ఉంటాయని కొందరు వాదిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube