ఓరి దేవుడా.. చనిపోయాడనుకుంటే.. 3 గంటల తర్వాత మళ్లీ..?!  

చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు అంటే.నీకేమైనా పిచ్చా.? చనిపోయిన వారు ఎలా వస్తారని ఖచ్చితంగా మనల్ని తిడతారు.కాకపోతే, తాజాగా ఓ వ్యక్తి మరణించాడని వైద్యులు నిర్ధారించిన మూడు గంటల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు.

TeluguStop.com - Oh My God If You Want To Die Again After 3 Hours

దీంతో వారి కుటుంబ సభ్యులు అలాగే ఆ ఆస్పిటల్ యాజమాన్యం ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఏర్పడింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ సంఘటన కెనడా దేశంలో జరిగింది.పీటర్ కిగెన్ అనే వ్యక్తి అప్పటివరకు వారి కుటుంబ సభ్యులతో సరదాగా నవ్వుతూ ఉండగా సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.

TeluguStop.com - ఓరి దేవుడా.. చనిపోయాడనుకుంటే.. 3 గంటల తర్వాత మళ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే తేరుకొని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేయగా కొద్దిసేపటికి ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.అంతేకాదు ఆ తర్వాత అతడి శరీరాన్ని మార్చురీ గదిలోకి కూడా మార్చేశారు.

అంత్యక్రియలు చేసే కార్యక్రమాల్లో భాగంగా తలమునకలైన హాస్పిటల్ వర్కర్లు ఆ తర్వాత శవాల గదిలో జరిగిన సంఘటన చూసి షాక్ కు గురయ్యారు.

చనిపోయిన వ్యక్తి పెద్ద ఎత్తున అరవడం మొదలు పెట్టాడు.దీంతో అక్కడున్న హాస్పిటల్ వ్యక్తులు షాక్ కి గురయ్యారు.వారు ఒక వైపు భయపడుతూనే ఉండగా మరోవైపు వారు వైద్యుడిని పిలిపించి అతడిని పరీక్షించారు.

అలా పరీక్షించిన వైద్యులు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారణ చేశారు.అయితే అతడు కళ్ళు తిరిగి పడిపోయిన సమయంలో ఎందుకు కిందపడిపోయాడన్న విషయం తనకు కూడా తెలియదని పీటర్ కిగెన్ తెలిపాడు.

అయితే, ఇప్పుడు దేవుడు తనకు రెండో జీవితాన్ని ప్రసాదించాడని తన మిగిలిన జీవితాన్ని పూర్తిగా దేవుడి సేవ లోనే గడుపుతాను అంటున్నాడు పీటర్ కిగెన్.అయితే ఈ మొత్తం విషయంలో తప్పు ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు.

అయితే మరణాన్ని దాటుకొని మళ్లీ ఇంటికి తిరిగి వచ్చిన పీటర్ కిగెన్ ను చూసి ఆయన కుటుంబసభ్యులు తెగ ఆనందపడి పోతున్నారు.అయితే అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి మన భారతదేశంలో కూడా ఇదివరకు జరిగింది.

#Dead Body #Suspension #After 3 Hours #Mourchary #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Oh My God If You Want To Die Again After 3 Hours Related Telugu News,Photos/Pics,Images..