వామ్మో.. ఈ రెండు త‌ల‌ల పామును చూస్తే ద‌డ పుట్టాల్సిందే..

మ‌న‌కు ఊర్ల‌ల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపించే పెద్ద పాముల‌ను లేదంటే కొంచెం వింత‌గా ఉన్న పాముల‌ను చూస్తేనే ద‌డ పుడుతుంది.ఇక అలాంటి వీడియోల‌కు కూడా సోష‌ల్ మీడియాలో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

 Oh My God If You See This Two-headed Snake, Snake, Viral Photo, Uttarakhand, Two-TeluguStop.com

నిముషాల్లోనే ఇలాంటి వీడియోలు విప‌రీతంగా వైల‌ర్ అవుతుంటాయి.కాగా పాముల్లో కూడా రెండు త‌ల‌ల పాములు ఉంటాయి.

ఇక ఇవి ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే కనిపిస్తుంటాయి.వీటిని చూసేందుకు కూడా జ‌నం ఎగ‌బ‌డుతుంటారు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి రెండు త‌ల‌ల పాముకు సంబంధించిన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇక ప్ర‌స్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు తలల కోబ్రా ఒక‌టి దర్శనమివ్వ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

ఈ రాష్ట‌రంలోని వికాస్‌నగర్‌లోని ఓ ప‌రిశ్ర‌మ ద‌గ్గ‌ర ఈ రెండు త‌ల‌ల పాము కనిపించింది.దాదాపు ఈ పాము ఒకటిన్నర అడుగుల పొడవుతో ఉన్న‌ట్టు తెల‌పుతున్నారు.కాగా ఈ పాము జన్యుపరమైన ప్రాబ్ల‌మ్ తోనే ఇలా రెండు త‌ల‌ల‌తో పుట్టిందా లేదంటే ఇంకేదైనా స‌మ‌స్యా అనేది తెలుస‌కోవ‌డానికి అటవీ అధికారులు ట్రై చేస్తున్నారు.కాగా ఈ రాష్ట్రంలో ఈ విధ‌మైన పాముల ర‌వాణా వివిధ కారణాల తీవ్రంగా ఉంద‌ని అటవీ అధికారులు తెలిపారు.

Telugu Forest Officers, Rare Snake, Snake, Headed Cobra, Uttarakhand-Latest News

అయితే మ‌నం చూసే సాధారణ రెండు తలల పాము అంటే తల ఏమో ముందుకు ఉంటే మ‌రొక తల ఏమో వెన‌క‌వైపున‌కు ఉంటుంది.అయితే ఈ అరుదైన పాముకు ఏమో ముందు భాగంలోనే తల ప్రాంతంలోనే రెండు తలలు ఉండ‌టం విశేషం.కాగా రెండు త‌ల‌లు ఉండ‌టంతో ఈ త‌ర‌హా పాముల‌న్నీ కూడా ఆహారం కోసం రెండు తలలు వేర్వేరుగా వేట సాగిస్తాయ‌ని అట‌వీ అధికారులు వెల్ల‌డిస్తున్నారు.ఇక ఇలాంటి పాము చాలా అరుదుగా క‌నిపిస్తుంద‌ని, కాబ‌ట్టి దీన్ని స్మ‌గ్లింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube